Health Benefits of Mangoes: వేసవి కాలం అంటే మామిడి పండ్లు తినడానికి బెస్ట్ టైమ్ కదా. ఇక మనం మామిడి పండ్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ పండ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? ఎలా తింటే బెటర్ వంటివి కూడా తెలుసుకుందాం. మామిడిని రుచి కోసం మాత్రమే తింటున్నారా? అసలు కాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే మామిడిని పండ్ల రాజు అని పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫైబర్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
మామిడి తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు తాజాదనాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ మామిడిని డైరెక్టుగా తినకుండా కాస్త నానబెట్టి తినడం మంచిది. మీరు మార్కెట్ నుంచి తెచ్చి నేరుగా తినకండి. ఓ అరగంట సేపు నీటిలో నానబెట్టి అప్పుడు తినండి. ఇలా చేస్తే అందులోని ఫైటిక్ ఆమ్లం పోతుంది. ఇలా తింటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు నిపుణులు. లేదంటే దురద, ఎలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. తొడిమ వద్ద ఉండే సొన పోయేలా కడగడం చాలా అవసరం.
Also Read: ఉదయం పూట తినాల్సిన అసలు సిసలు ఫుడ్డు ఇదే
ఇక భోజనం చేస్తూ, చేసిన వెంటనే పండ్లను అసలు తినవద్దు. కానీ మామడి పండుకు మాత్రం ఈ అవసరం లేదు. దీనిని ఫుడ్ తో కూడా తీసుకోవచ్చట. అంతేకాదు పాలతో కలిపి తీసుకుంటే మరింత మంచిది. మరో మంచి ప్రయోజనం చెప్పనా? ఈ మామిడి పండు శృంగారం మీద ఆసక్తిని కూడా పెంచుతుంది. వాత, పిత్త దోషాలను తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది.
వేసవిలో, అధిక చెమట పట్టడం లేదా తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మామిడితో తయారు చేసిన మామిడి పన్నా తీసుకున్నా సరే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. మామిడిలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నుంచి రక్షించే లక్షణాలు ఉంటాయి. ఇది వేసవికి చాలా ప్రయోజనకరమైన పానీయం. అంతేకాదు మామిడి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా, ఇది స్ట్రోక్, గుండెపోటును నివారిస్తసుంది.
Also Read: ఈ ఒక్క టెస్ట్ తో క్యాన్సర్ ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.. అదేంటంటే?
మామిడి తినడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది . వేసవి కాలంలో కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మామిడి తినడం చాలా ప్రయోజనకరం. జీర్ణ-పేగు రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడి తినడం వల్ల పేగుల్లో పిత్త స్రావం పెరుగుతుంది. ఇది కొవ్వు శోషణను పెంచుతుంది. హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. మామిడి తినడం కాలేయం, పేగు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మామిడి పండ్లలో రారాజు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.