Alert For Alcohol Drinkers : మానసిక ప్రశాంతత కోసం మందు తాగడం తప్పనిసరి అని కొందరి భావన. దీంతో చాలామంది మద్యం సేవించడానికి ఏమాత్రం ఆలోచించరు. మద్యం తాగడం వల్ల హానికరమని కొంతమంది అంటుంటే.. గుండె మేలు కోసం కాస్త తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఏది ఏమైనా మద్యం తాగాలని అనుకునే వారు వాటి గురించి తెలుసుకొని తీసుకోవాలని అంటున్నారు. కొంతమందికి బీరు తాగడం ఇష్టం. మరి కొంతమందికి విస్కీ తీసుకోవడం అలవాటు. అయితే విస్కీ తీసుకునే వారు కొన్ని రకాల బ్రాండ్ల గురించి తెలుసుకోవాలి. వీటిని ఎవరు? ఏ పరిస్థితిలో? తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బీరు కంటే విస్కీ తాగడమే రాయల్ గా ఉంటుందని కొందరు మద్యం ప్రియులు చెబుతూ ఉంటారు. కొంచెం విస్కీ తీసుకొని అందులో సోడా.. లేదా నేరుగా తీసుకుంటే ఆ కిక్కే వేరని అంటూ ఉంటారు. అయితే ఈ విస్కీ తీసుకునే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం తీసుకునే బ్రాండ్లపై కొన్ని రకాల విషయాలను రాసి ఉంటుంది. వీటిలో బ్లెండెడ్ విస్కీ, సింగిల్ మాల్ట్ విస్కీ అని ఉంటుంది. అసలు వీటి అర్థం ఏంటి?
Also Read: హరి హర వీరమల్లు’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే
కొన్ని రకాల బ్రాండ్లపై సింగిల్ మాల్ట్ విస్కీ అని రాసి ఉంటుంది. ఉదాహరణకు గొడవన్, పాల్ జాన్ అనే విస్కీ పై ఇది కనిపిస్తుంది. దీని ధర ఎక్కువగానే ఉంటుంది. దీనిని మాల్టెడ్ బార్లీతో తయారుచేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల ఒక ప్రత్యేకత అనుభూతి ఉంటుంది. అలాగే అమృత్, ఇంద్రి వంటి బ్రాండ్లపై కాస్ట్ స్ట్రెంత్ అని రాసి ఉంటుంది. ఇలా రాసి ఉంటే ఇందులో 60 శాతం ఆల్కహాలు ఉన్నట్టు గ్రహించాలి. ఇందులో కొంచెం నీరు కలిపితే బాగుంటుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువగా కిక్కు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొత్తగా మద్యం తీసుకునేవారు.. స్మూత్ గా ఉండాలని అనుకునేవారు.. జానీ వాకర్ బ్రాండ్ తీసుకోవడం మేలు అని అంటారు. ఎందుకంటే ఇది సింగిల్ మాల్ట్, గ్రీన్ విస్కీల కలయికతో తయారవుతుంది. దీంతో ఇది రుచిగాను, కాస్త కఠినంగానే ఉంటుంది. ఇది తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యం గురికాకుండా ఉంటుందని కొందరు అంటుంటారు. భారత్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా నేరుగా విస్కీ తాగాలని అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికోసం నీట్ అండ్ అండ్ ది రాక్స్ అనే లేబుల్ ఉన్న గ్రాండ్ తాగొచ్చు. ఇందులో కాస్త వాటర్ కలుపుకున్న ఎలాంటి రుచి తగ్గదు.
Also Read: అసలు ఎన్టీఆర్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడా?
మట్టిలో నీరు పోస్తే వచ్చే స్మెల్, పొగ స్మెల్ కావాలని కోరుకునే వారికి పీటెడ్ విస్కీ మంచి అనుభూతి ఇస్తుందని అంటున్నారు. ఇది సరికొత్త రుచులను ఇస్తూ హాయిని గొలుపుతుంది. ఇలాంటి విస్కీలు ఎక్కువగా స్కాట్లాండ్లోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఏంజిల్స్ షేర్ అనే మద్యం తీసుకోవడం వల్ల కొత్త అనుభూతిని పొందుతారు. ఇది తీసుకున్న తర్వాత ఎక్కువగా నోటిలో ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఇలా మద్యం తాగేవారు స్పెషల్ బ్రాండ్లను తీసుకోవడం వల్ల కొత్త అనుభూతిని పొందుతారు.