Exercise Tips: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, వ్యాపారం చేసేవారు బిజీ వాతావరణం లో గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తమ విధుల కారణంగా సమయం తీరిక లేక ఉంటున్నారు. దీంతో వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. అయితే కొందరికి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించిన నేపథ్యంలో వైద్యులు వ్యాయామం చేయాలని చెబుతున్నారు. కానీ పనుల కారణంగా తమకు సమయం లేదని అంటున్నారు. అయితే ప్రతిరోజు గంటలకొద్దీ వ్యాయామం చేయకుండా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా గుండె జబ్బులు లాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. మరి ఆ చిన్న వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం లేవగానే చాలామందికి బ్రేక్ ఫాస్ట్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఒక గంట వరకు ప్రత్యేకంగా వ్యాయామంపై అది కూడా ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. వీటిలో మొదటిది కూర్చొని లేవడం.. దీనినే చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునేటప్పుడు బస్కీలు తీయించడం అని అనేవారు. ఒక రకంగా దీనిని వ్యాయామంగా చేపిస్తూనే.. మరోవైపు తప్పుకు శిక్ష రూపంలో దీనిని చేయించేవారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ఒక నిమిషం చేస్తే చాలు.
అలాగే కాసేపు వెల్లకిలా పడుకొని ఉండండి. ఇలా పడుకున్నప్పుడు కాళ్ళను పైకి కిందికి అంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాళ్లలో ఉండే నరాలు తేలికగా మారుతాయి. దీనిని కూడా ఒక నిమిషం పాటు చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల నడిచినప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి.ఇందులో భాగంగా పుష్అప్ కూడా చేస్తూ ఉండాలి. అంటే నేలకు బోర్లకిల తలను ఆనిచ్చి ఒక నిమిషం పాటు లేస్తూ ఉండాలి. అలాగే జంపింగ్ కూడా ఒక నిమిషం పాటు చేయాలి.
Also Read: బాడీలో ఏ ఫుడ్ ఎంత సేపట్లో అరుగుతుందో తెలుసా?
ఇలా మొత్తం నాలుగు నిమిషాల పాటు వర్కౌట్ చేయడం వల్ల బాడీలో ఎన్నో రకాల క్యాలరీలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో శరీరం తేలికగా మారిపోతుంది. ఆ తర్వాత రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వాస్తవానికి వ్యాయామం చేయడానికి కూడా చాలామందికి సమయం లేదు. కానీ ఎక్కువసేపు కాకుండా ఇలా ఉదయం నాలుగు నిమిషాల పాటు ఇలా వర్కౌట్ చేసి ఆ తర్వాత ఒక నిమిషం పాటు ధ్యానం చేయడం వల్ల మనసు ఎంత ప్రశాంతంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో పనికిరాని ఎన్నో విషయాలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ఐదు నిమిషాల పాటు ఇలా ఆరోగ్యం కోసం వెచ్చించడం ద్వారా జీవితాంతం కష్టం లేకుండా కొనసాగుతారు. లేకుంటే శరీరం బరువుగా ఉండి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ వ్యాయామం ప్రతిరోజు తప్పనిసరిగా చేయడం వల్ల నెల రోజుల్లో శరీరం గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలతో కూడా ఇలాంటి వ్యాయామాలు చేయించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.