Health Insurance : ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ కార్డు తప్పనిసరిగా మారింది. ఎందుకంటే ఎప్పుడు.. ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. అయితే కొందరు ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా తక్కువ ప్రీమియం ఉంది కదా అని కొన్ని పాలసీలు తీసుకుంటారు. కానీ ఆ తర్వాత వీటితో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్ తీసుకునే ముందే కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా ఈ ఆరు విషయాల్లో మాత్రం పకడ్బందీగా వ్యవహరించాలి. ఇంతకీ ఆరు ఏంటంటే?
వ్యాధుల కవరేజ్:
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎన్ని వ్యాధులకు ఇది వర్తిస్తుంది? ఇలాంటి చికిత్సలు చేస్తారు? దీనిపై వైద్య ఫీజులు ఎన్ని భరించాలి? ఎంత కవరేజ్ అవుతుంది? అన్న విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరు పాలసీదారులు కొన్ని విషయాలను మాత్రం చెప్పి మిగతా విషయాలను చెప్పరు. సరైన సమయానికి వైద్యులు వాటిని చెప్పడంతో అదనంగా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ఎలాంటి వ్యాధులకు ఈ కవరేజ్ ఉందో ముందే తెలుసుకోవడం చాలా అవసరం.
వెయిటింగ్ పీరియడ్ ఎంత?
కొన్ని పాలసీలు ప్రారంభించిన కనీస గడువు తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు వేల రూపాయలు చెల్లించి పాలసీ తీసుకున్న తర్వాత వెంటనే వైద్య ఖర్చులు అవసరం పడితే అప్పుడు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే కొందరు ఈ విషయాన్ని చెప్పరు. అందువల్ల మొదటి ప్రీమియం చెల్లించిన తర్వాతే పాలసీ కవరేజ్ ప్రారంభమవుతుందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలి. అయితే ఇప్పుడున్న దాదాపు పాలసీలు మొదటి ప్రీమియం తర్వాతనే కవరేజ్ కి వర్తిస్తున్నాయి.
అద్దెపరిమితి?
చాలా పాలసీల్లో అద్దెకు సంబంధించిన కవరేజ్ ఇవ్వరు. దీనిపై పాలసీ కొనుగోలుదారులు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ పాలసీ తీసుకునేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణ వైద్య ఖర్చుల కంటే అద్దె ఖర్చులే అధికంగా ఉంటాయి. అందువల్ల బీమా లో గది అద్దే పరిమితి ఎంతవరకు ఉంది? ఎలాంటి గదులకు అవకాశం ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలి.
ఎలాంటివి కవర్ చేస్తారు?
పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా కొందరు రూ.10 లక్షలు లేదా రూ.20 లక్షల పాలసీలు కొనుగోలు చేస్తారు. కానీ ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి? లేదా అదనంగా ఎలాంటి చికిత్సలు చేస్తారు. ప్రసూతి వంటి వాటికీ ప్రయోజనాలు ఉన్నాయా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవడం అవసరం.
క్లైమ్:
పాలసీ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దీనిని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే కొన్ని పాలసీలకు కొన్ని ఆసుపత్రిలో కవరేజ్ ఇవ్వవు.. ఇలాంటి అప్పుడు నెట్వర్క్ లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఎలాంటి హాస్పిటల్స్ మనకు అవసరం పడతాయి? అనే విషయాలను తెలుసుకోవాలి.