Health Insurance : నేటి కాలంలో ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మారింది. ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎప్పుడూ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది. దీంతో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కొన్ని కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. వారు తమకు సంబంధించిన రియంబర్స్మెంట్ కోసం క్లీన్ చేసుకుంటే రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఏదైనా సమస్య ఉంటే పర్వాలేదు.. కానీ అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ ఉన్న తర్వాత కూడా కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి అనే సమస్యను ఎదుర్కొంటే.. దీని పరిష్కారం ఎలా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని సంస్థలు వీటిని పరిష్కరిస్తున్నాయి. అవేంటంటే?
ఇన్సూరెన్స్ తీసుకోమని చాలా కంపెనీలు ప్రకటనలు చేస్తూ ఉంటాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత మళ్లీ ఏజెంట్లు కనిపించరు. అంతేకాకుండా హెల్త్ పాలసీని క్లీన్ చేసుకునే సమయంలో ఇతరులు అందుబాటులో ఉండరు. అయితే రియంబర్స్మెంట్ కోసం అన్ని రకాల డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్న కొన్ని కంపెనీలు కావాలని రిజెక్ట్ చేస్తున్నాయని మీరు అనుకుంటే.. మీరు ఈ సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చు.
Also Read: జబర్దస్త్ షోలో ఊహించని మార్పు, అనూహ్యంగా ఆయన రీ ఎంట్రీ!
ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఫిర్యాదు చేయాలని అనుకుంటే కంపెనీకి సంబంధించిన GRO కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా అంటే? మొబైల్ లోని గూగుల్ లోకి వెళ్లి.. Irdai List Of Gro అని టైప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన GRO మెయిల్ ఐడి తో పాటు ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన జిఆర్వోకు మెయిల్ చేసి సమస్యను తెలపాలి. ఇదే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలి. వారు ఈ డాక్యుమెంటను పరిశీలించిన తర్వాత జన్యు అయితే కచ్చితంగా వారు సమస్యను పరిష్కరిస్తారు. మీరు ఈ సమస్యను వారికి తెలిపిన 14 రోజుల్లో కచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారే క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉంది.
అయితే GRO కూడా సరైన విధంగా స్పందించలేదని మీరు అనుకుంటే మరో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే? గూగుల్ లోకి వెళ్లి Bhima Bharosa portal అని టైప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చే వెబ్సైటు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ముందుగా మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కావాల్సిన సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత మెడికల్ కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేజీలో కంప్లైంట్ డీటెయిల్స్ అనే లైన్ లో సమస్యను మొత్తం వివరించి చూపాలి. అంతేకాకుండా ఇందులో కూడా కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పూర్తికాగానే ఒక ట్రాక్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా IRDA వారు ఈ క్లెయిమ్ ను వెంటనే పరిష్కరించి అవకాశం ఉంటుంది.