spot_img
Homeహెల్త్‌Diabetes : మధుమేహం ఉన్నవాళ్లు వేరుశెనగ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Diabetes : మధుమేహం ఉన్నవాళ్లు వేరుశెనగ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Diabetes : మధుమేహం ఉన్నవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రతరం అయ్యి మరణం సంభవించవచ్చు. మధుమేహం ఉన్నవారు చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఏ పదార్థం తిన్నా ఆలోచించి తినాలి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు వేరుశెనగ తినకూడదని చాలామంది సందేహ పడతారు. వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటిని మధుమేహం ఉన్నవారు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయని వీటిని తినడం మానేస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా? తింటే ఏమవుతుందో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. కాస్త చిన్న ముక్క తిన్న ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు వేరుశెనగ గింజలను తినవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వేరుశెనగ గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యమైన కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ రోగులను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. గుండె ప్రమాదాలు రాకుండా సాయం చేస్తుంది. కూరల్లో కూడా మార్కెట్లో దొరికే నూనెలను కంటే.. వేరుశెనగ నూనెను వాడితే ఆరోగ్యంగా ఉంటారు. మార్కెట్లో దొరికే వేరుశెనగ నూనె కంటే ఎలాంటి రసాయనాలు లేకుండా గానుగ నూనెను వాడటం మేలు.

మధుమేహం ఉన్నవారు వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అయితే వీటిని పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమే. మధుమేహం ఉన్నవారు రోజుకి ఒక పిడికెడు వేరుశెనగలను మాత్రమే తీసుకోవాలి. అయితే వీటిని చక్కెర, ఉప్పుతో తినకూడదు. ఇవి లేకుండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వీటిని సలాడ్‌, బెల్లం చెక్కీలుగా చేసి తినవచ్చు. ఇందులో మినరల్స్, ఫైబర్ గుండెకు మేలు చేయడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. అయితే కొంతమంది మధుమేహ రోగులకు వేరుశెనగలు తినడం వల్ల అలర్జీ వస్తుంది. ఇలాంటి వాళ్లు వేరుశెనగ గింజలను తినకపోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవారు డైలీ ఒక మూడు నెలల పాటు ఇలా చేయడం వల్ల ఫిట్‌గా బరువు పెరుగుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper