Healthy Eating Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చాలా చర్యలు తీసుకోవాలి. ఉదయం లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తినే ఫుడ్, వాటర్ అన్ని విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొందరు వ్యాయామం చేస్తే మరికొందరు తమ ఆహారాన్ని మార్చుకుంటారు. మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీ రోజులో కచ్చితంగా పప్పు దినుసులు యాడ్ చేసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన అల్పాహారంతో పాటు లంచ్, డిన్నర్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
కచ్చితంగా మీ రోజులో కంది పప్పు, బొబ్బర్లు, చిక్కుల్లు, పెసల్లు, రాజ్మా, బ్రౌన్ రైస్, గోధుమలతో పాటు పల్లీలు, నట్స్ వంటి వాటిని చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా మీ ఆయుష్షు పెరుగుతుందట. ఏకంగా పురుషులు 13 సంవత్సరాలు, మహిళలు 10.3 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారు అని చెబుతుంది గ్లోబల్ బర్డెన్. అంతేకాదు వీటితో పాటు చికెన్, మటన్ వంటివి తగ్గించాలి అని సూచిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువగా జీవిస్తారన్నమాట.
అయితే ఆహార సమస్యల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా కోటి పది లక్షల మంది చనిపోతున్నారట. అందుకే మీ డైట్ లో మంచి ఫుడ్ ను చేర్చుకోండి. పైన తెలిపిన పప్పు దినుసులు నట్స్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. ఇందులో ప్రోటీన్, నికోటిన్ ఆమ్లం, థయామిన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి-6, థయామిన్ వంటి ముఖ్యమైన పోషకాలను ఉండటం వల్ల కంటి చూపు, మెదడు, స్కిన్, గుండె వంటి వాటికి ప్రయోజనం చేకూరుతుంది. మంచి పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిని తినడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.
Also Read: ప్రపంచవ్యాప్తంగా ఎగబడుతున్నారు.. మన ఆకు కూరకు ఎందుకు అంత డిమాండ్?
ఇక బాదం వంటి నట్స్ లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, రాగి, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులో కొన్నింటిని నానబెట్టి తింటే మరింత ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి పప్పులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అవిసె గింజలు వంటి సూపర్ ఫుడ్ కూడా మీకు చాలా మంచివి. వాటిని నానబెట్టి తినడం వల్ల లిగ్నన్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల శోషణ మెరుగుపడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ విత్తనాలలో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. వీటిని నానబెట్టడం వల్ల జీర్ణం కావడం సులభం అవుతుంది. నానబెట్టిన నువ్వులు తినడం వల్ల శరీరంలో కాల్షియం, మెగ్నీషియం శోషణ పెరుగుతుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.