Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని ఫ్యామిలీ కి గత కొద్ది రోజుల నుంచి సరైన సక్సెస్ లు అయితే దక్కడం లేదు. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఇక నాగార్జున తన 100 వ సినిమాను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికి కథ మాత్రం సెట్ అవ్వడం లేదు అంటూ కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
అక్కినేని ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది. నాగేశ్వరరావు లాంటి దిగ్గజ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక వాళ్ల వారసులుగా వచ్చిన అఖిల్ కూడా తమదైన రీతిలో ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ను రెండో వివాహం చేసుకోబోతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే అఖిల్ కూడా జైనబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటూ ఒక ఇంటి వాళ్ళు కాబోతుండడం మంచి విషయమనే చెప్పాలి. ఇక అక్కినేని ఫ్యామిలీతో పాటు వాళ్ళ అభిమానులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున ఇప్పటివరకు వీళ్ళ కెరియర్ మీదే చాలా కేర్ ఫుల్ గా సాగుతున్నప్పటికి వీళ్ళకి సినిమాలపరంగా పెద్దగా సక్సెస్ అయితే రావడం లేదు. దాంతో వాళ్ళ బరువు బాధ్యతలు మొత్తాన్ని నాగార్జున చూసుకుంటున్నారు.
ఇక ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోవడంతో కొంతవరకు ఆయన బరువు బాధ్యతలు దిగిపోతున్నాయి అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పర్సనల్ లైఫ్ లో సెట్ అవుతున్న అక్కినేని హీరోలు ప్రోఫేషనల్ లైఫ్ లో కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన చిన్న హీరోలు సైతం మంచి విజయాలను సాధిస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతుంటే ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలకు పైన అవుతున్నా కూడా అక్కినేని వారసులకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు.
మరి ఇలాంటి సందర్భంలో పర్సనల్ లైఫ్ లో పెళ్లి చేసుకొని సెట్ అయినట్టుగానే ఇండస్ట్రీలో కూడా ఒక భారీ సక్సెస్ లను అందుకుంటు సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో అక్కినేని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరికలను తీరుస్తూ ఇద్దరు భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి అతి పర్సనల్ గా, ఇటు ప్రొఫెషనల్ గా సెట్ అవ్వాలని కోరుకుందాం…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Will nagarjunas responsibility be fulfilled will the lives of the brothers change after marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com