Dhurandhar: ఈ ఏడాది ఇండియా లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి, ఇప్పుడు బాలీవుడ్ లో ఆల్ టైం గ్రాసర్ గా నిలవబోతున్న ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం, ఇప్పటికే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని దాటేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. ట్రెండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆగేలా కనిపిమ్చడం లేదు. జనవరి నెల మొత్తం రన్ అయ్యేలా ఉంది. ఇలాంటి మెగా బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ చూసి ఎన్నేళ్లు అయ్యిందో. ఈ చిత్రం లో డైరెక్టర్ ఆదిత్య ధర్ పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎదో దశాబ్దాలు పాకిస్తాన్ లో స్పై గా వ్యవహరించి, అక్కడి సీక్రెట్స్ అన్నిటిని కలిపి సినిమాగా తీసినట్టు అనిపించింది. ఆ రేంజ్ వర్క్ చేసాడు ఆదిత్య.
‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీన్ మునీర్ పేరు ని మీరంతా వినే ఉంటారు. పహాల్గమ్ లో ఉగ్రదాడి జరగడానికి ఈ దుర్మార్గుడు మాట్లాడిన మాటలే కారణం అని అందరికీ ఒక స్పష్టత ఉంది. ఆ దాడి వెనుక ఇతని హస్తం కూడా ఉంది అనేది జగమెరిగిన సత్యం. ఆ భయం తో ‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో ఇతను పాకిస్తాన్ వదిలి పారిపోయాడు. మళ్లీ యుద్ధం ముగిసిన తర్వాత కనిపించాడు. అయితే మన సైన్యం ఆసీన్ మునీర్ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. చైనా నుండి 5వ తరం యుద్ధ విమానాలు, టర్కీ నుండి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనేందుకు నానా తిప్పలు పడుతోంది. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్’ చిత్రం లో పాకిస్తాన్ ‘డీప్ స్టేట్’ సైన్యం ISI కూటమి, ఆ దేశం లో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ ఆదిత్య.
2000 వ సంవత్సరం లో కరాచీ ప్రాంతాన్నీ శాసించిన రెహమాన్ దాకైత్ , ఉజైర్ బలోచ్ వంటి మాఫియా డాన్స్ తో పాకిస్థాన్ సైన్యం ఎలాంటి రహస్య సంబంధాలను మైంటైన్ చేస్తూ వచ్చిందో ఈ చిత్రం లో స్పష్టంగా చూపించారు. అరబ్ దేశాల్లో ‘ధురంధర్’ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆపేసారు. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్స్ అన్ని ఆ సినిమాలో చూపించారు కాబట్టి. పాకిస్తాన్ ఎంత నీచమైన దేశమో చూపించారు కాబట్టి, మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా చేశారు. కానీ అక్కడి జనాలను మాత్రం ఈ సినిమాని చూడకుండా ఆపడం లో విఫలం అయ్యారు. ఇంటర్నెట్ లో పైరసీ కాపీ ని డౌన్ లోడ్ చేసుకొని ఈ సినిమాని ఎగబడి చూసేస్తున్నారు పాకిస్తానీయులు మరియు ఇతర అరబ్ దేశాలకు చెందిన జనాలు. ఇదంతా ఆసీన్ మునీర్ వికృత చేష్టలను బయటపెట్టినట్టు అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం ఆయనకు వెన్నులో వణుకుపుట్టించే రేంజ్ కి వెళ్ళింది.