Homeఎంటర్టైన్మెంట్Aditya Dhar Wife Yami Gautam: ధురంధర్' డైరెక్టర్ సతీమణి కూడా టాలీవుడ్ లో ఒక...

Aditya Dhar Wife Yami Gautam: ధురంధర్’ డైరెక్టర్ సతీమణి కూడా టాలీవుడ్ లో ఒక క్రేజీ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

Aditya Dhar Wife Yami Gautam: పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్స్ లీగ్ లోకి రీసెంట్ గానే ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం తో ఆదిత్య డర్ అడుగు పెట్టాడు. ఈ సినిమాకు ముందు ఆయన బాలీవుడ్ లో ‘URI : ది సర్జికల్ అటాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, భారీ వసూళ్లను రాబట్టి, పలు క్యాటగిరీలలో నేషనల్ […]

Aditya Dhar Wife Yami Gautam: పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్స్ లీగ్ లోకి రీసెంట్ గానే ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం తో ఆదిత్య డర్ అడుగు పెట్టాడు. ఈ సినిమాకు ముందు ఆయన బాలీవుడ్ లో ‘URI : ది సర్జికల్ అటాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, భారీ వసూళ్లను రాబట్టి, పలు క్యాటగిరీలలో నేషనల్ అవార్డ్స్ ని సైతం సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆయన ‘ఆర్టికల్ 370’, ‘ధూమ్ ధామ్’, ‘బారాముల్లా’ వంటి చిత్రాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటింగ్ రాయడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘ధురంధర్’ చిత్రంతో ఆయన మేకింగ్ స్టైల్ తో జీనియస్ అని అనిపించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు.
అయితే ఆదిత్య డర్(Aditya Darr) సతీమణి కూడా సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయే. ఈమె తెలుగు, హిందీ   భాషల్లో హీరోయిన్ గా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, యామీ గౌతమ్(Yami Gautam Darr). ఈమె 2010 వ సంవత్సరం లో ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. మన తెలుగులో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ మూవీ కి రీమేక్ ఇది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వం లో తెరకెక్కిన ‘నువ్విలా’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అదే విధంగా తెలుగు లో ఈమె అల్లు శిరీష్ మొదటి చిత్రం ‘గౌరవం’ లో హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత తరుణ్ తో కలిసి ‘యుద్ధం ‘ అనే సినిమాలో కూడా నటించింది. తెలుగు లో ఈమె చివరిసారిగా కనిపించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, నితిన్ ఇందులో హీరోగా నటించాడు.
ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఈమె కనిపించలేదు. తెలుగు లో నువ్విలా అనే చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, మిగిలిన సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. తెలుగు లో ఈమె సక్సెస్ కాలేదు కానీ బాలీవుడ్ లో భారీ విజయాలను చాలానే నమోదు చేసుకుంది. 2021 వ సంవత్సరం లో ఈమె ఆదిత్య డర్ ని పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ 2024 వ సంవత్సరంలో వేదవిడ్ అనే కొడుకు కూడా పుట్టాడు. ఇకపోతే రీసెంట్ గా ఈమె ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ లో కూడా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. మార్చి 19 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper