Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Postponed: 'ధురంధర్ 2' చిత్రం వాయిదా పడబోతోందా..? అందుకు ఆధారాలు ఇవే!

Dhurandhar 2 Postponed: ‘ధురంధర్ 2’ చిత్రం వాయిదా పడబోతోందా..? అందుకు ఆధారాలు ఇవే!

Dhurandhar 2 Postponed: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు దాటింది. కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1370 కోట్ల […]

Dhurandhar 2 Postponed: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు దాటింది. కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం, నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 10 రోజులకుఈ 16 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ లోని ఇండియన్ మూవీస్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ కూడా నెట్ ఫ్లిక్స్ లో ఒక రేంజ్ లో చూశారు. ఈమధ్య కాలం లో తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. దీంతో రెండవ భాగం పై అంచానాలు మన తెలుగు ఆడియన్స్ లో తారా స్థాయిలో ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే హిందీ ఆడియన్స్ కంటే మనోళ్లే ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చు. ఆ రేంజ్ క్రేజ్ ఉంది ఈ చిత్రానికి. అయితే రీసెంట్ గా విడుదల చేసిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) టీజర్ కి తెలుగు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. కారణం, ‘ధురంధర్’ క్లైమాక్స్ లో రెండవ భాగానికి సంబంధించిన క్లిఫ్ హ్యాంగర్ షాట్స్ ఏవైతే చూపించారో, అవే ఈ టీజర్ లో కూడా చూపించారు. ఒక్క కొత్త సన్నివేశాన్ని కూడా చూపించలేదు.

అప్పటి నుండి ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఒక అనుమానం ఏర్పడింది. అసలు ఈ సినిమా మార్చి 19 న విడుదల అవుతుందా లేదా?, ఒకవేళ నిజంగా విడుదల ఉంటే, ఎందుకు టీజర్ లో కొత్త షాట్స్ ఒక్కటి కూడా చూపించలేదు?, అంటే షూటింగ్ ఆమేరకు జరగలేదా?, ఇంకా చాలా భాగం వరకు షూటింగ్ మిగిలిపోయిందా?, కేవలం మార్చి 19 న డేట్ రిజర్వ్ చేయడానికే మొన్న సరికొత్త టీజర్ ని విడుదల తేదీతో ప్రకటించారా?, ఇలా ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. మరో పక్క ఈ సినిమా విడుదలైన రోజున, KGF హీరో యాష్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కాబోతుంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు వాయిదా పడితే, మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19 న విడుదల అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper