Homeఎంటర్టైన్మెంట్Prabhas kindness: ఇందుకే ప్రభాస్.. నువ్వు అందరి గుండెల్లో ‘డార్లింగ్‘ అయ్యావ్!

Prabhas kindness: ఇందుకే ప్రభాస్.. నువ్వు అందరి గుండెల్లో ‘డార్లింగ్‘ అయ్యావ్!

Prabhas kindness: పేరుకే పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. కానీ నిజ జీవితం లో ప్రభాస్(Rebel Star Prabhas) తన తోటి మనుషులతో ఎంత ఫ్రెండ్లీ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో మాట్లాడితే అసలు పెద్ద హీరో తో మాట్లాడిన ఫీలింగ్ అసలు రాదు. ఎదో మన తోటి స్నేహితులతో మాట్లాడినట్టుగా అనిపిస్తాది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన మాట్లాడే తీరు కానీ , బయట తనను కలవడానికి వచ్చిన స్నేహితులతో ఆయన […]

Prabhas kindness: పేరుకే పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. కానీ నిజ జీవితం లో ప్రభాస్(Rebel Star Prabhas) తన తోటి మనుషులతో ఎంత ఫ్రెండ్లీ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనతో మాట్లాడితే అసలు పెద్ద హీరో తో మాట్లాడిన ఫీలింగ్ అసలు రాదు. ఎదో మన తోటి స్నేహితులతో మాట్లాడినట్టుగా అనిపిస్తాది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన మాట్లాడే తీరు కానీ , బయట తనను కలవడానికి వచ్చిన స్నేహితులతో ఆయన మాట్లాడే పద్దతిని కానీ చూసినప్పుడు ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది, ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి, ఇంత సింపుల్ గా ఎలా ఉండగలరు ?, ఇన్ స్టాగ్రామ్ లో ఒక పది వేల మంది ఫాలోవర్లు రాగానే సెలబ్రిటీలు లాగా ఫీల్ అయిపోయే మనుషులు ఉన్న ఈరోజుల్లో , వేల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ , పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ ఇసుమంత గర్వం తో కూడా కనిపించడే, ఎలా సాధ్యం ఇలా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.

ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి నేర్చుకుంటే జీవితం లో ప్రతీ ఒక్కరు బాగుపడతారు. ఇంకా చెప్పాలంటే ఒక మంచి మనిషిలాగా కూడా మారుతారు. ముఖ్యంగా స్నేహానికి ఆయన ఇచ్చే విలువ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తనకు ఎంతో మంచి స్నేహితుడైన మంచు విష్ణు, తన కన్నప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ చెయ్యమని కోరితే, క్షణం కూడా ఆలోచించకుండా, పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఆ చిత్రం లో నటించాడు. అదే విధంగా తనకు ఎంతో ఇష్టమైన పూరి జగన్నాథ్ సినిమాకు ప్రొమోషన్స్ అడిగితే చేసి పెట్టాడు. ఇక తనకు కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందించిన శోభన్ (వర్షం డైరెక్టర్) కుటుంబానికి మొదటి నుండి అండగా ఉంటూ వస్తున్నాడు ప్రభాస్.

Also Read: ‘పెద్ది’ లోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని లీక్ చేసేసిన రామ్ చరణ్.. కొంప ముంచేశాడుగా!

పెద్ద స్థాయికి వెళ్లిన తర్వాత వాళ్ళని మర్చిపోలేదు. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ ‘ కి ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా చేసి పెట్టాడు. ఈ ఇంటర్వ్యూ ఆ సినిమాకు ఎంత ఉపయోగపడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడవ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యాయి అంటే , అందుకు కారణం ప్రభాస్ ఇంటర్వ్యూ నే. ఈ ఇంటర్వ్యూలో ఒక క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందులో సంతోష్ శోభన్ తనకు ఎదురైనా ఒక సంఘటన గురించి చెప్తూ ‘మీ అభిమానులు చాలా మంది నన్ను డార్లింగ్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. డార్లింగ్ నెంబర్ నా దగ్గర లేదురా బాబు అని చెప్తుంటాను’ అని అంటాడు. అందుకు ప్రభాస్ ‘ఇటు రా. నీకు నా నెంబర్ ఇస్తాను. నెంబర్ ఉంది కదా అని ఇబ్బంది పెట్టకు. ఏదైనా ముఖ్యమైన విషయమైతేనే ఫోన్ చెయ్యి. ఊరికే చేస్తే తంతాను’ అని అంటాడు. ఈ వీడియో ని చూసినప్పుడు ఒక అన్నయ్య తన తమ్ముడితో మాట్లాడితే ఎలా ఉంటుందో , అలా అనిపించింది. ప్రభాస్ అభిమానులు సంతోష్ శోభన్ లో తమని తాము చూసుకుంటూ , ఇందుకే అన్నా, నువ్వు అందరి గుండెల్లో డార్లింగ్ అయ్యావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper