Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma performance: అవకాశాలు ఇచ్చినా నో యూజ్.. ఇంకా ఎందుకు జట్టు అభిషేక్ ను...

Abhishek Sharma performance: అవకాశాలు ఇచ్చినా నో యూజ్.. ఇంకా ఎందుకు జట్టు అభిషేక్ ను మోయాలి?

Abhishek Sharma performance: ద్వైపాక్షిక సిరీస్లో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ లో అద్భుతం సృష్టించాడు. అందువల్లే టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడిగా అవతరించాడు. అతడి ప్రతిభకు తగ్గట్టుగానే మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది. అతడిని ఏకంగా ఓపెనర్ ను చేసింది.

ప్రస్తుత టి20 ఫార్మాట్లో అభిషేక్ శర్మ నెంబర్ వన్ ఆటగాడు. టి20 వరల్డ్ కప్ లో అతడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడతాడని.. గొప్ప గొప్ప పరుగులు చేస్తాడని అందరూ భావించారు. కానీ ఇంతవరకు అతడి బ్యాట్ నుంచి ఒకసారి మాత్రమే గొప్ప ఇన్నింగ్స్ నమోదయింది. అదికూడా జింబాబ్వే జట్టు మీద. అభిషేక్ శర్మ లాంటి ఆటగాడు ఇలా అయిపోవడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. మేనేజ్మెంట్ కూడా అతనికి వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది.

వెస్టిండీస్ జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు. అనవసరమైన బంతిని గట్టిగా కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా ఒత్తిడి ఎదుర్కొంది. ఇప్పుడు మాత్రమే కాదు గత కొన్ని మ్యాచ్లలో అతడు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. డక్ అవుట్ అవుతున్నాడు. దీనికి తోడు ఫీల్డింగ్ లో కూడా దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడు. వరుసగా సున్నాలు చుడుతు జుట్టుకు భారంగా మారిపోయాడు.

Also Read: టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. సంజు శాంసన్ చేసిన పనికి అందరూ ఫిదా!

ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో.. అంతకుముందు దక్షిణాఫ్రికా సిరీస్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ
.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో మాత్రం విఫలమవుతున్నాడు. గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. పరుగులు తీయలేకపోతున్నాడు. చివరికి ఫీల్డింగ్ లో నిరాశ పరుస్తున్నాడు. విలువైన క్యాచ్ లు నేలపాలు చేస్తున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా రెండు క్యాచ్ లు అభిషేక్ శర్మ జారవిడిచాడు. అతడు ఆ క్యాచ్ లు పట్టకపోవడం వల్ల వెస్టిండీస్ భారీ స్కోర్ చేయగలిగింది. టీమిండియా మూల్యం చెల్లించుకుంది.

జింబాబ్వే మీద 55 పరుగులు మాత్రమే చేసిన అతడు.. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో అతడిని దూరం పెట్టాలని.. అభిషేక్ శర్మ స్థానంలో మరొక ఆటగాడికి స్థానం కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జట్టుకు భారంగా మారిన ఆటగాడికి ఇంకా అవకాశాలు ఇవ్వడంలో అర్థం లేదని.. ద్వైపాక్షిక సిరీస్.. ఐపీఎల్ లో ఆడినంతమాత్రాన అభిషేక్ శర్మ గొప్ప ఆటగాడు కాలేడని.. ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీలలో తన సత్తా చూపిస్తేనే గొప్ప ఆటగాడిగా రూపాంతరం చెందుతాడని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular