Homeఎంటర్టైన్మెంట్Ram Charan leaks Peddi interval scene: 'పెద్ది' లోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని లీక్ చేసేసిన...

Ram Charan leaks Peddi interval scene: ‘పెద్ది’ లోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని లీక్ చేసేసిన రామ్ చరణ్.. కొంప ముంచేశాడుగా!

Ram Charan leaks Peddi interval scene: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రతీ ఒక్కటి కూడా అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఒక సినిమా ఎలా ఉండబోతుంది అనేది , కేవలం ఆ సినిమా తాలూకు ప్రమోషనల్ కంటెంట్ ని చూసి చెప్పేయొచ్చు. ఈ […]

Ram Charan leaks Peddi interval scene: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రతీ ఒక్కటి కూడా అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఒక సినిమా ఎలా ఉండబోతుంది అనేది , కేవలం ఆ సినిమా తాలూకు ప్రమోషనల్ కంటెంట్ ని చూసి చెప్పేయొచ్చు. ఈ సినిమాలో అలాంటి కంటెంట్ ఇప్పటికే బోలెడంత బయటకు వచ్చేసింది. గ్లింప్స్ వీడియో నే పెద్ద హిట్ అనుకుంటే, ‘చికిరి ..చికిరి ‘ పాట గ్లోబల్ వైడ్ గా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. నేడు ఈ చిత్రం నుండి రెండవ పాట విడుదల కాబోతుంది. ‘రయ్..రయ్’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ‘చికిరి చికిరి’ ని మించే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను రామ్ చరణ్ నిన్ననే మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేసిన వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో రామ్ చరణ్ మానిటర్ లో కనిపిస్తున్న షాట్ కి డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవ్వడం , అప్పుడు డైరెక్టర్ బుచ్చి బాబు షాట్ రెడీ సార్ అనడం , అప్పుడు రామ్ చరణ్ ‘ఏమది’ అంటూ డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిల్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, రామ్ చరణ్ డైలాగ్ చెప్తున్న షాట్ టైం స్టాంప్ కూడా ఆ వీడియో లో ఉండడం తో , రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇది ఇంటర్వెల్ సన్నివేశం అన్నమాట అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ టైం స్టాంప్ ని బాగా గమనిస్తే 1:22 గంటలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ సినిమాలో అయినా ఇంటర్వెల్ సన్నివేశం వచ్చేది కరెక్ట్ గా ఈ టైం స్టాంప్ దగ్గరే . దీంతో రామ్ చరణ్ ఈ సినిమా లో ఇంటర్వెల్ సన్నివేశం ఎలా ఉండబోతుందో లీక్ చేసేశాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ అంటే కచ్చితంగా ఎదో ఒక ఫైట్ సన్నివేశం , లేదా భారీ ట్విస్ట్ ఉండే సన్నివేశం పెడుతారు కానీ, ఇక్కడ చూస్తుంటే చాలా నార్మల్ సన్నివేశం లాగా ఉండే ?, క్లిక్ అవ్వుద్ధో లేదో అనే భయం అభిమానుల్లో ఉంది. కానీ ఈ సన్నివేశం ప్రీ ఇంటర్వెల్ కూడా అయ్యుండొచ్చు కదా ? అని మరికొందరు అంటున్నారు. మరి ఎలాంటి ఇంటర్వెల్ డైరెక్టర్ ప్లాన్ చేశాడు అనేది తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper