NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పట్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తను ఇక్కడ ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టించాడు. చాలా సినిమాల్లో డిఫరెంట్ పాత్రలను పోషించి తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన చేసిన నటన అద్భుతమనే చెప్పాలి.
ఇక ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో బాలయ్య బాబు…ఈయన కూడా ఇప్పటికీ స్టార్ హీరోగా గుర్తింపు పొంది సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక వీళ్ల తర్వాత మూడోవ జనరేషన్ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎన్టీయార్ ఆ ఫ్యామిలీతో కలిసి మెలిసి ఉండేవాడు. ముఖ్యంగా బాలయ్య బాబు తో చాలా బాగా కలిసిపోయేవాడు.
ఇక ఎవ్వరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పార్టీ మీటింగ్ లకు అటెండ్ అవుతూనే సినిమాలు కూడా చేసుకునేవాడు. ఇక ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు పార్టీ తరుపున క్యాంపెనింగ్ కూడా చేసేవాడు. అలా 2009వ సంవత్సరంలో టిడిపి పార్టీ తరపున క్యాంపెనింగ్ చేసి టిడిపి పార్టీ కి మంచి సీట్లు రావడానికి హెల్ప్ చేశాడు. ఇక ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ పార్టీ తరుపున నిలబడిన ఆయన గత కొద్ది రోజులుగా ఏమైందో తెలియదు గానీ బాలయ్య కి చంద్రబాబు నాయుడుకు చాలా దూరంగా ఉంటున్నాడు.
అయితే వీళ్లకు జూనియర్ ఎన్టీఆర్ దూరమవ్వడానికి కారణం వాళ్ళ నాన్న హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్నాడనే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ గా ఉంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక కొంతమంది మాత్రం వాళ్ల మధ్య విభేదాలు రావడానికి అసలు కారణం ఇది కాదు మరొకటి ఉంది అంటున్నారు. కానీ సరైన కారణం ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పడం లేదు…
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Why is ntr staying away from balakrishna and chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com