Vyjayanthi Movies : నేషనల్ వైడ్ గా ఇటీవల కాలంలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీ కిడ్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) తనయుడు అకిరా నందన్(Akira Nandan) అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. తన తండ్రి తో కలిసి ఈమధ్య కాలంలో అకిరా నందన్ బాగా తిరుగుతున్నాడు. ఇటీవలే ఆయన తన తండ్రి తో పాటు ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో అకిరా నందన్ బాగా హైలైట్ అయ్యాడు. ఇదేమి కటౌట్ రా బాబు, ఇదేమి అందంరా బాబు, పవన్ కళ్యాణ్ ని కూడా డామినేట్ చేసేస్తున్నాడుగా అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మెంటలెక్కిపోయారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కచ్చితంగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యేంత సత్తా ఈ కుర్రాడిలో ఉందని అభిమానులు మురిసిపోయారు.
Also Read : మొదటి సినిమాకే పాన్ ఇండియన్ డైరెక్టర్..2 ఏళ్లలో అకిరా నందన్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ!
పవన్ కళ్యాణ్ ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఉపముఖ్యమంత్రిగా, పలు కీలకమైన శాఖలకు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఆయన చేతుల్లో ఫినిషింగ్ స్టేజి లో ఉన్నటువంటి మూడు సినిమాలకు డేట్స్ ని కేటాయించడానికి సమయం సరిపోవడం లేదు, అలాంటిది భవిష్యత్తులో ఇక ఆయన సినిమాలు చేస్తాడా అంటే కచ్చితంగా అనుమానమే. అందుకే అకిరా ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో అతని తల్లి రేణు దేశాయ్ అకిరా కి యాక్టింగ్ మీద ఆసక్తి లేదని చెప్పేది కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, అకిరా ని యాక్టింగ్ స్కూల్ లో చేర్పించింది. గత ఏడాది నుండి ఆయన పవన్ కళ్యాణ్ కి నటన నేర్పించిన సత్యదేవ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. మరో రెండేళ్ల లోపు అకిరా నందన్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసే బాధ్యతలు చేపట్టిన నిర్మాత అశ్విని దత్, అకిరా నందన్ ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు అట. వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే అకిరా మొదటి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రశాంత్ నీల్(Prashanth Neel) చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తో పంజా లాంటి స్టైలిష్ మూవీ ని తీసిన విష్ణు వర్ధన్ కూడా అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు అనే సమాచారం మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. చూడాలి మరి ఏమి జరగబోతుందో. అకిరా తన తండ్రి లాగానే ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్ తో యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేయగలడా లేదా అనేది తెలియాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే.
Also Read : సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన అకిరా నందన్ లేటెస్ట్ లుక్స్..మురిసిపోతున్న అభిమానులు!