Homeటాప్ స్టోరీస్HYDRA: హైడ్రా రంగనాథ్ పట్టుదల.. తమ్మిడి కుంట మారిందిలా.. వైరల్ వీడియో

HYDRA: హైడ్రా రంగనాథ్ పట్టుదల.. తమ్మిడి కుంట మారిందిలా.. వైరల్ వీడియో

HYDRA: రెండు సంవత్సరాల క్రితం.. ఆగస్టు నెలలో హైడ్రా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా మాదాపూర్ ప్రాంతంలోని సినీ నటుడు నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసింది. ఆ కన్వెన్షన్ సెంటర్ తమ్మిడికుంట సరస్సు వద్ద ఉండేది. అదంతా అక్రమమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే నాడు నాగార్జునకు గులాబీ పార్టీ అండగా నిలిచింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీదికి బుల్డోజర్లు వెళ్లినప్పటికీ.. చివరి […]

HYDRA: రెండు సంవత్సరాల క్రితం.. ఆగస్టు నెలలో హైడ్రా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా మాదాపూర్ ప్రాంతంలోని సినీ నటుడు నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసింది. ఆ కన్వెన్షన్ సెంటర్ తమ్మిడికుంట సరస్సు వద్ద ఉండేది. అదంతా అక్రమమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే నాడు నాగార్జునకు గులాబీ పార్టీ అండగా నిలిచింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీదికి బుల్డోజర్లు వెళ్లినప్పటికీ.. చివరి నిమిషంలో ఆగిపోయాయి. దీని వెనుక ఎవరున్నారు.. ఏం జరిగింది అనేది ముంజేతి కంకణమే.

ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. హైదరాబాదులో చెరువుల పరిరక్షణ.. నాలాల పరిరక్షణ.. అక్రమణాల తొలగింపు వంటి వాటికోసం ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా రంగనాథ్ ను నియమించారు. రంగనాథ్ సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఎన్నో కేసులను పరిష్కరించిన సత్తా ఆయన సొంతం. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ఆక్రమణలను ఆయన పరిష్కరించారు. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోయారు. డైనమిక్ ఆఫీసర్ గా.. నిజాయితీకి నిలువుద్దం లాగా ఆయనను చూస్తారు. అందువల్లే రేవంత్ రెడ్డి హైడ్రా బాధ్యతను రంగనాథ్ కు అప్పగించారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన తర్వాత.. ప్రభుత్వం అక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టింది. తమ్మిడి కుంట సరస్సును పూర్తిగా మార్చేసింది. ఇందులో పేరుకుపోయిన 35000 ట్రక్కుల వ్యర్ధాలను తొలగించింది. నీటి నిర్వ సామర్థ్యాన్ని 46 మిలియన్ లీటర్ల నుంచి 375 మిలియన్ లీటర్లకు పెంచింది. సరస విస్తీర్ణాన్ని పనులు ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు పెంచింది. దీనికోసం హైడ్రా రంగనాథ్ విశేషంగా కృషి చేశారు. ప్రతిరోజు పనులను పర్యవేక్షించారు. అంతేకాదు అక్కడ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించిన వారందరికీ సావధానంగా సమాధానం చెప్పారు. కొందరు కోర్టు కేసులు వేస్తే.. వాటిని కూడా సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగారు.

హైడ్రా రంగనాథ్ చూపించిన చొరవ వల్ల తమ్మిడికుంట పరిసరాలు ఆహ్లాదంగా మారిపోయాయి. మురుగునీటితో దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న పరిసరాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ వ్యర్ధాలు.. చెత్త.. బయో మెడికల్ వేస్ట్ వంటి వాటితో డంపింగ్ యార్డ్ లాగా తమ్మిడి కుంట ఉండేది. ఇప్పుడు ఆ వ్యర్ధాలను పూర్తిగా వదిలించుకొని పర్యావరణహితంగా.. ఆరోగ్యకరంగా మారింది. 30 వేల ట్రక్కులకు పైగా కూడిక తొలగించడంతో దుర్గంధం పూర్తిగా తొలగిపోయింది. చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్ వే, అత్యాధునిక ఓపెన్ జిమ్ లు, పిల్లలకు క్రీడా స్థలం ఏర్పాటు చేశారు. చెరువును సందర్శించేందుకు వచ్చేవారు కూర్చోవడానికి ఏర్పాటుచేసిన 60 సంవత్సరాల బోన్సాయ్ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మొక్కలను చెరువు చుట్టూ నాటి.. పచ్చదనాన్ని మరింత పెంచుతామని హైడ్రా అధినేత రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ చేసిన కృషి వల్ల చెరువు ఇలా మారిపోయిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించబోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper