Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: వైసిపి విష ప్రచారాన్ని చంద్రబాబు ఎలా దెబ్బ కొట్టారంటే

Chandrababu: వైసిపి విష ప్రచారాన్ని చంద్రబాబు ఎలా దెబ్బ కొట్టారంటే

TDP leadership conclave: నేటి సాంకేతిక కాలంలో డేటా వినియోగం అధికంగా పెరిగిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కంపెనీలు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా వినియోగంలో సరికొత్త డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖ నగరంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు.. లోకేష్ చౌరవ వల్ల డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. దీనిపై మొదట్లో వైసిపి […]

TDP leadership conclave: నేటి సాంకేతిక కాలంలో డేటా వినియోగం అధికంగా పెరిగిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కంపెనీలు సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా వినియోగంలో సరికొత్త డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

విశాఖ నగరంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు.. లోకేష్ చౌరవ వల్ల డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. దీనిపై మొదట్లో వైసిపి క్రెడిట్ చోరీ అంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత డేటా సెంటర్ కి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసింది. తన సొంత మీడియాలో డేటా సెంటర్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. అనర్ధాలు వస్తున్నాయని విష ప్రచారం మొదలుపెట్టింది. మొదట్లో ఒక విధంగా.. ఆ తర్వాత మరో విధంగా నాలుక మడతపెట్టి వైసిపి తన ధోరణి ప్రదర్శించుకుంది.

వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి మొత్తంగా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు..”ప్రఖ్యాతమైన గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి వచ్చింది. మిగతా రాష్ట్రాలు అసూయగా చూసాయి. కొంతమంది వ్యక్తులు దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తుల కుట్రలను విజయవంతంగా తిప్పి కొట్టాం. మన రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. ఇది మనందరికీ గర్వకారణం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా కొత్తగా ఉద్యోగాలు వస్తాయని” చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన టిడిపి లీడర్షిప్ కాంక్లెవ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ సెంట్రల్.. పాలకొల్లు.. మండపేట.. నెల్లూరు నగరం.. తనుకు బంటి నియోజకవర్గాలు జీఎస్టీపీ సాధనలో మొదటి స్థానంలో ఉన్నాయి. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జి ఎస్ డి పి 20.35 లక్షల కోట్లని.. దాదాపు 15 నుంచి 20 రంగాలలో గ్రోత్ పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డేటా సెంటర్ లకు నీటి కేటాయింపునకు సంబంధించి చంద్రబాబు వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారు.. గూగుల్ డేటా సెంటర్ కు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. మౌలిక వస్తువుల కల్పనలో వేగాన్ని పెంపొందించడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. అంతేకాదు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రేన్యూర్ అనే భావన ను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీల నీళ్లను సరఫరా చేస్తామని.. డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు.. చాలామందికి ఉపాధి లభిస్తుందని చంద్రబాబు వివరించారు..” ఎల్ నీనో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ గోదావరి నది నుంచి 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. ఇందులో కనీసం 300 టీఎంసీల నీళ్లు వాడుకుని ఉంటే పరిస్థితి మారేది. మూడు సంవత్సరాల కాలంలో 35వేల కోట్లతో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులను కచ్చితంగా పూర్తి చేస్తాం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తిచేస్తామని” చంద్రబాబు హామీ ఇచ్చారు.

డేటా సెంటర్ కు నీటి కేటాయింపు విషయంలో క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు.. వంశధార.. గోదావరి.. కృష్ణ.. తుంగభద్ర.. కావేరి.. పెన్నా నదులను అనుసంధానం చేస్తే రిజర్వాయర్లు మొత్తం నింపుకోవచ్చని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ కాలంలో 10.7 టీఎంసీల నీళ్లను నిల్వ చేసామని.. వచ్చే ఏడాది 50 టీఎంసీల నీళ్లను నిల్వ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం రెండవ దశ పూర్తి చేసుకోవడం ద్వారా 190 టీఎంసీల నీళ్లను విలువ చేసుకోవచ్చు అని.. బొల్లాపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే 350 టీఎంసీల నీళ్లు నిలువ చేసుకోవచ్చని.. కడప జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి 100 టీఎంసీల నీళ్లను నిల్వచేసే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. నెల్లూరు జిల్లాలో సోమశిల.. కండలేరు జలాశయాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో 35వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రిజర్వాయర్లను మొత్తం నింపి మొత్తంగా 1250 నుంచి 1400 టీఎంసీలు నీటిని నిల్వ చేసే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగితే.. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ మీద రాయితీ భారం తగ్గుతుందని.. ఆ మిగులు డబ్బులను ఇతర రంగాలకు మళ్లించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper