Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాంటి గొప్ప నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన దసరాకి విశ్వంభర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఆగస్టు 22వ తేదీన అతని బర్త్ డే ఉన్న సందర్భంగా అదే రోజు బాబీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు…ఇక ప్రస్తుతం తన సినిమాలైనప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
బాబి తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయిన చిరంజీవి ఆ సినిమా ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల ను పక్కన పెడితే డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో సినిమా చేయబోతుండనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇది రీమేక్ సినిమానా లేదంటే స్ట్రైయిట్ కథ తోనే రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళతో పాటుగా ‘జైలర్’ సినిమాతో స్టార్ట్ డమ్ ని అందుకున్న నెల్సన్ డైరెక్షన్ లో కూడా చిరంజీవి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. రీసెంట్ గా నెల్సన్ చిరంజీవిని కలిసి ఒక కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది. అయితే ‘జైలర్ 2’ సినిమా సక్సెస్ ని సాధిస్తే నెల్సన్ సినిమానే మొదట స్టార్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి…
ఇక ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న వాళ్ళ వెనకాలే హీరోలు గాని, ప్రొడ్యూసర్స్ గానీ పడతారు. కాబట్టి నెల్సన్ ‘జైలర్ 2’ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనే దాని మీదనే అతను చిరంజీవితో సినిమా చేయబోతున్నాడా? లేదా అనేది ఫిక్స్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…
