Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి సినిమాల్లో ఆ ఒక్కటి మిస్ అవుతుందా..?

Chiranjeevi: చిరంజీవి సినిమాల్లో ఆ ఒక్కటి మిస్ అవుతుందా..?

Chiranjeevi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ప్రస్తుతం సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటూనే తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతనికి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చిరంజీవి ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని పొందలేకపోతున్నాడు. […]

Chiranjeevi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ప్రస్తుతం సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటూనే తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతనికి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చిరంజీవి ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని పొందలేకపోతున్నాడు. కారణమేదైనా కూడా తను నటనలో వైవిధ్యాన్ని చూపిస్తున్నప్పటికి ఒకప్పుడు చిరంజీవి అంటే ఈజీగా నవరసాలను చేది మెప్పించగల నటుడు అంటూ కామెంట్స్ చేసేవారు. మొత్తానికైతే చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉండేది. మరలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో తన నటనలో ఏదో క్లారిటి మిస్ అవుతున్నాడు. ఇక దానికి తోడుగా ఏదో తెలియని అసంతృప్తిలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అతన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా తన యాక్టింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించడం లేదు. మరి ఎందుకని ఆ ఒక్కటి తను కోల్పోతున్నాడు. నిజానికి చిరంజీవి ఏజ్ పెరిగింది కాబట్టి నటన లో వైవిధ్యాన్ని చూపిస్తూ డిఫరెంట్ యాక్టింగ్ చేస్తే ఇప్పుడున్న హీరోలకు సైతం పోటీని ఇచ్చినవాడవుతాడు.

మరి చిరంజీవి రాబోయే రోజుల్లో ఇంక భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే చిరంజీవి ఈ మధ్యకాలంలో చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తున్నాడు. ఎంత మంది దర్శకులు తన వెంటపడినా కూడా తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు…

చిరంజీవి అంటే ఖైదీ, ఇంద్ర, ఠాగూర్,శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు గుర్తుకొస్తాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వైవిద్య భరితమైన పాత్రలను చేసి మెప్పించాడు. కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఘనత తనకే దక్కుతుంది.

ఇక అలాంటి చిరంజీవి ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని పలికించడంలో కొంతవరకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఏజ్ పెరిగినా కొద్ది ఆయన ఫేస్ లో వచ్చిన మార్పులే దానికి కారణం అని కొంతమంది అంటున్నారు. మరి కొంత మంది మాత్రం చిరంజీవి ఇంకా ట్రై చేస్తే పూర్వ వైభవాన్ని తీసుకురాగలరని మరి కొంత మంది తెలియజేస్తున్నారు. రాబోయే సినిమాల్లో ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper