Homeఎంటర్టైన్మెంట్Virataparvam: 'భీమ్లానాయక్​' బాటలోనే 'విరాటపర్వం'.. రిలీజ్​ అప్పుడేనా!

Virataparvam: ‘భీమ్లానాయక్​’ బాటలోనే ‘విరాటపర్వం’.. రిలీజ్​ అప్పుడేనా!

Virataparvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేశ్​బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్​ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్​లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వినిపించాయి. అయితే, చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

కాగా, సురేశ్​ బాబు నిర్మాతగా వ్యవహరించిన నారప్ప సినిమా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దృశ్యం2 కూడా అమెజాన్​ ప్రైమ్​ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అయితే, రానా నటించిన భీమ్లా నాయక్​ సినమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో పలకరించనుంది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్​ సినిమా విడుదలైన తర్వాత.. విరాట పర్వం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్​ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

భీమ్లనాయక్​ సినిమాలో పవన్​కల్యాణ్​- రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సాగర్​ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. త్రివిక్రమ్​ ఈ సినిమాకు స్క్రీన్​ ప్లే, మాటలు అందిస్తున్నారు. థమన్​ స్వరాలు అందించారు. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper