
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ మూవీ నిన్ననే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ నారప్పకు భారీ ధరను అమెజాన్ చెల్లించినట్టు టాక్. కరోనా లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీ పట్టాలెక్కకపోవడంతో 2021లో విడుదలయ్యే పెద్ద సినిమాల్లో ‘నారప్ప’ ఒకటి. ఈ చిత్రం జూలై 20న ఈ ఫ్లాట్ ఫాంపై ప్రసారం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో 240 దేశాలు , వివిధ ప్రాంతాలలో ఈ చిత్రాన్ని భారీగానే రిలీజ్ చేస్తున్నారు. ఇక వెంకటేశ్ నటించిన ‘దృశ్యం2’ మూవీని కూడా డిస్నీ + హాట్ స్టార్ లోనే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వెంకటేశ్ రెండు వరుస చిత్రాలు ఓటీటీ ద్వారానే విడుదల కావడం ఆసక్తిగా మారింది.
ఇప్పుడు అదే బాటలో వెంకటేశ్ అన్న కొడుకు రానా సినిమా కోసం పోయింది. రానా-సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందట.. ఓ ఓటీటీ ‘విరాటపర్వం’ను భారీ రేటుకు కొనేందుకు ముందుకు వచ్చిందట.. ఈ మేరకు అంతర్జాతీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘రానా’ మూవీని భారీ రేటుకు కొనేందుకు చర్చలు జరుపుతోంది.
‘విరాటపర్వం’ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ ఒప్పందం దాదాపు ఖరారవుతుందని.. ‘విరాటపర్వం’ కూడా ఓటీటీల్లో రిలీజ్ కావడం ఖాయమంటున్నారు.