Homeఎంటర్టైన్మెంట్Buttabomma: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. 700 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న బుట్టబొమ్మ!

Buttabomma: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. 700 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న బుట్టబొమ్మ!

Buttabomma: త్రివిక్రమ్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ నటించిన సినిమా అల వైకుంఠపురములో. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతూనే వచ్చాయి. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులు కురిపించింది. అయితే, ఈ సినిమా హిట్​ వెనక సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలకు థమన్​ సంగీతం అందించారు. త్రివిక్రమ్​ ఈ సినిమా కోసం ఎంత స్పెషల్​ కేర్​ తీసుకున్నారో ఈ ఆల్బమ్​ని బట్టి తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సూపర్​హిట్​గా నిలిచి.. ప్రేక్షకులను ఎంతగానో హద్దుకున్న పాటల్లో బుట్ట బొమ్మ ఒకటి.

buttabomma

ఈ పాట విడుదలైనప్పుడే వ్యూస్​ పరంగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఆ జోరును కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఏకంగా 700 మిలియన్ల వ్యూస్​ మార్కును అందుకుని మరో భారీ రికార్డు క్రియేట్​ చేసింది. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్​, చిత్ర యూనిట్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం త్రివిక్రమ్​ భీమ్లానాయక్​ సినిమాకు పనిచేస్తున్నారు. ఇందులో సినిమాకు స్క్రీన్​ప్లేతో పాటు, మాటలు కూడా అందిస్తున్నారు. కాగా, ఇటీవలే ఆయన రాసిన పాట లాలా భీమ్లా విడుదలై సెన్​షేషన్ క్రియేట్​ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్పలో బన్నీ హీరోగా చేస్తున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్​లో ఎప్పుడూ చేయని విభిన్న పాత్రలో కనిపించనున్నారు బన్నీ. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలోని ఐటెం సాంగ్​లో సమంత సందడి చేయనుండటం విశేషం. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈసినిమా.. తొలి పార్టును డిసెంబరులో విడుదల చేయనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular