Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా స్టార్ చిరంజీవి కి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆయిన వారసుడిగా తెర పైకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గా తనయుడు లాగా ఇండస్ట్రీ లో తనదైన గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు, తనదైన ముద్ర కూడా వేసాడు. తండ్రి వారసత్వాన్ని అన్ని విధాలుగా పుణికి పుచ్చుకున్నాడు చెర్రీ. ముందుగా స్టార్ గా స్థిరపడిన రాంచరణ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
చెర్రీ చేసిన ప్రతి ఒక్క సినిమాలో వైవిధ్యమైన హెయిర్ స్టయిల్ ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చెయ్యడానికి పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా ఉన్నాడు చెర్రీ కి. మిగతా స్టార్ హీరోలు కూడా రామ్ చరణ్ లాగా వైవిధ్యంగా ప్రేక్షకులకి కనిపించడానికి పర్సనల్ స్టైలిస్ట్ లను కూడా నియమించుకుంటారు. వీరిలో చాలా మంది మహా నగరం ముంబై నుండి వస్తుంటారు.
అయితే ఈ స్టైలిస్ట్ లు రోజుకి సంపాదించే డబ్బులు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. రోజు కి లక్ష రూపాయలకి పైగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు స్టే చెయ్యడానికి హోటల్, వెళ్ళడానికి ఫ్లైట్ చార్జీలు కూడా ఎక్స్ ట్రా పేమెంట్ కింద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు భరించాల్సిందే.
రాజా మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని వినికిడి. అయితే ఈ సినిమాకి పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ బిల్ లక్షల్లో ఉందట. కేవలం రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ కి రోజుకు 1.5 లక్షల రూపాయల్ని ప్రొడక్షన్ టీం చెల్లిస్తుందట. ఈ స్టైలిస్ట్ కి తోడుగా ఇంకొక 3 అసిస్టెంట్స్ కూడా ఉన్నారట. వీళ్ళకి బిజినెస్ క్లాస్ టికెట్ తో పాటు ఫైవ్ స్టార్ హోటల్లో మంచి సూట్ రూమ్ ని డిమాండ్ చేశారట. అయితే షూటింగ్ అయ్యేసరికి వీళ్ళ బిల్లు కోట్లలో రావచ్చని సమాచారం. అయితే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలంతా ఇదే క్రేజ్ ని ఫాలో అవుతున్నారట. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ మూవీలలో నటించారు.