Virataparvam: రానా దగ్గుబాటి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్కళ్యాణ్తోకలిసి భీమ్లానాయక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రానా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వ సినిమా కూడా చేస్తున్నారు రానా.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించాయి. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో 1990లో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా, రానా పుట్టినరోజు సందర్భంగా విరాట పర్వ నుంచి రానా వాయిస్‌తో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ది వాయిస్ ఆఫ్ రవన్న పేరుతో వచ్చి ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. రానా ఇందులో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా కనిపించగా.. అతను రాసిన కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే కథ. ఇందులో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Virataparvam movie latest updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com