Homeఎంటర్టైన్మెంట్Vijay vs Pawan Kalyan Comparison: విజయ్ తో పవన్ కు ఏం పోలిక

Vijay vs Pawan Kalyan Comparison: విజయ్ తో పవన్ కు ఏం పోలిక

Vijay vs Pawan Kalyan Comparison: రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు ఉంటాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధానంతో ముందుకు వెళుతుంది. తమ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక్కోసారి రాజకీయాల్లో దూకుడు పనిచేస్తుంది. మరోసారి వికటిస్తుంది. ఒకసారి వ్యూహాలు పనిచేస్తాయి. మరోసారి ప్రతికూలతలు చూపుతాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో సినీ నటుడు విజయ్ సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ […]

Vijay vs Pawan Kalyan Comparison: రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు ఉంటాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధానంతో ముందుకు వెళుతుంది. తమ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక్కోసారి రాజకీయాల్లో దూకుడు పనిచేస్తుంది. మరోసారి వికటిస్తుంది. ఒకసారి వ్యూహాలు పనిచేస్తాయి. మరోసారి ప్రతికూలతలు చూపుతాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో సినీ నటుడు విజయ్ సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానికి మించి అన్నట్టు విజయ్ కోసం చర్చిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో విజయ్ ను పోలిక పెట్టి విస్తృత చర్చ జరుగుతుండడం గమనార్హం. ఎందుకంటే ఇద్దరూ ఒకే మాదిరిగా సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత వ్యవహారాలు, రాజకీయ పార్టీ ఏర్పాటు వంటివి ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ను డి గ్రేట్ చేస్తూ పోలిక పెడుతుండడం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది పవన్ ఫ్యాన్స్ కు..

* పవన్ మాదిరిగానే విజయ్..
అచ్చం పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కు ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాలను రీమేక్ చేసి తమిళంలో సక్సెస్ఫుల్ హీరోగా మారారు విజయ్. పవన్ కళ్యాణ్ మాదిరిగా వ్యక్తిగత, దాంపత్య జీవితంలో కూడా విజయ్ కు కొన్ని వివాదాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య భావ సారూప్యత ఉంది. కానీ రాజకీయాల్లో మాత్రం విభిన్న రీతిలో అడుగులు వేశారు ఇద్దరు. విభిన్న ఫలితాలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆధారపడి రాజకీయాలు చేశారు. నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై గురిపెట్టలేదు. కానీ విజయ్ మాత్రం నేరుగా.. సోలోగా పోటీ చేసి తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన 10 సంవత్సరాలకు అధికారంలోకి వస్తే.. విజయ్ పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్లలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు దీనినే పోలిక తెస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

* విభిన్న రాజకీయాలు..
అయితే ఒక్కటి గుర్తించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో రాజకీయ,సినీ రంగాలు మమేకమై ఉంటాయి. ఏపీలో మాత్రం ఒక్కటిగా చూడలేం. నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు గురించి తెలియనిది కాదు. తరువాత వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తమిళనాడు మాదిరిగా ఇక్కడ సినీ రాజకీయాలు వర్కౌట్ కావు అనేది అప్పుడే తెలిసిపోయింది. ప్రజల్లో నమ్మకం కుదిరితే కానీ వారు నమ్మే పరిస్థితి ఉండదని భావించి పవన్ కళ్యాణ్ తన పార్టీని నిలకడగానే నడిపారు. ఏపీతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ. అందుకే అక్కడ పరిస్థితులకు తగ్గట్టు దూకుడుగా అడుగులు వేశారు విజయ్. ఆ రాష్ట్రానికి తగ్గట్టు రాజకీయాలు చేసి సక్సెస్ అయ్యారు.

* ఏపీలో ఆ పరిస్థితి లేదు..
ఏపీలో ఆ పరిస్థితి లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి పాలనతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రం 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. విడివిడిగా పోటీ చేస్తే ఓట్ల చీలిక వచ్చి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుతుంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ పొత్తుల ఆలోచన చేశారు. అయితే ఈ పొత్తులు ఎప్పుడు విచ్చినం అవుతాయా అని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పొత్తు ఉండగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టం. అందుకే తమిళనాడులో విజయ్ విజయాన్ని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు కూడా..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper