spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Anu Nenu Book Launch: పవన్ అను నేను.. కొత్త ఆవిష్కరణ

Pawan Anu Nenu Book Launch: పవన్ అను నేను.. కొత్త ఆవిష్కరణ

Pawan Anu Nenu Book Launch: పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుతూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన బలాన్ని, తన బలహీనతలను అంచనా వేసుకుని మాత్రమే రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా.. ఎన్ని రకాలుగా రచ్చ కొడుతున్నా రెచ్చిపోవడం లేదు. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలన్నది ఆయన అభిమతం. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యర్ధుల ట్రాప్ లో పడవద్దని.. తాను పొత్తు పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప.. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి ఉండాలన్నది తన లక్ష్యం అని.. పరోక్షంగా చంద్రబాబు నాయకత్వానికి పవన్ జై కొడుతూ వచ్చారు.

* పొత్తు చెడగొట్టేందుకు..
ఏపీలో పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు జరగని ప్రయత్నం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన ను వేరు చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఏనాడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చంద్రబాబు పరామర్శకు వెళ్లి ప్రకటన చేశారో.. నాటి నుంచి పొత్తు చెడగొట్టేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని మరి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తనతో ఉన్నవారు ఉండండి.. లేకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. దీంతో చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా జనసేన ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మాటలు రుచించడం లేదు.

* కొత్త పుస్తకం ఆవిష్కరణ..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధేయ నేతలు సైతం టిడిపి తో జనసేన కలిసి ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కష్టం అని తేల్చి చెప్పారు. అదే సమయంలో టిడిపి తో జనసేన పొత్తు చెడగొట్టేందుకు పతాక స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదులో పవన్ అభిమానులు, జనసేన అభిమానులు ఒకరు పవన్ అను నేను పుస్తకాన్ని రాసుకోచ్చారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకాన్ని రాయగా ప్రముఖ నేతలు ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే మంత్రిగా.. పవన్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే జనసైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి స్థానంలో చూస్తున్నారు. ఈ పుస్తకావిష్కరణ ద్వారా.. ఆ బలాన్ని మరింత బలంగా చాటుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper