Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram Varma: పిఠాపురం వర్మపై వేటు.. టిడిపి గట్టి హెచ్చరిక

Pithapuram Varma: పిఠాపురం వర్మపై వేటు.. టిడిపి గట్టి హెచ్చరిక

Pithapuram Varma: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పదవి నుంచి వర్మను కలిగిస్తూ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. వర్మను తొలగించి.. టిడిపి పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు నేతలతో కూడిన కమిటీకి అప్పగించింది. వర్మ వ్యక్తిగత వ్యవహార శైలి కూటమి సమన్వయానికి విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టిడిపి నుంచి కూటమికి ఇబ్బంది రాకుండా ఉండేందుకుగాను.. వర్మ పై వేటు వేసింది టిడిపి నాయకత్వం.

* ఎన్నికల్లో సహకరించినా..
మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది బలమైన నియోజకవర్గం. అందుకే వర్మ నేతృత్వంలోని టిడిపి శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. కానీ చంద్రబాబు చొరవ తీసుకొని ఒప్పించడంతో పవన్ గెలుపు కోసం కృషి చేశారు వర్మ. అంతవరకు ఓకే కాని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. వర్మ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. పిఠాపురం నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలతో ఘర్షణ వైఖరి అనుసరించారు. మొన్ననే జనసేన మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో వీధి పోరాటానికి దిగారు. కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ పేరుతో వర్మ ఘర్షణ వైఖరి అనుసరిస్తున్నారు అని టిడిపికి నివేదికలు అందాయి.

* స్పష్టమైన సంకేతాలు..
కూటమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు పంపింది టిడిపి నాయకత్వం. మొన్నటి ప్రోటోకాల్ రగడ తర్వాత వర్మకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. దీంతో వర్మ విషయంలో టిడిపి నాయకత్వం చూసి చూడనట్టుగా వెళుతుందని ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు దానికి చెక్ చెబుతూ వేగంగా ఇంచార్జ్ పదవి నుంచి వర్మను తొలగించారు. కూటమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని సంకేతాలు పంపింది టిడిపి నాయకత్వం. అయితే వర్మకు చెప్పి తొలగించారా? ఈ ఆదేశాలు వెనుక వర్మ ఎలా స్పందిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. వర్మ కోసం ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ప్రచారం బలంగా జరిగింది. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper