spot_img
Homeజాతీయ వార్తలుYS Jagan And Vijay: విజయ్ గెలుపుతో జగన్ ప్రాణ స్నేహితుడు అయ్యాడా!

YS Jagan And Vijay: విజయ్ గెలుపుతో జగన్ ప్రాణ స్నేహితుడు అయ్యాడా!

YS Jagan And Vijay: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి వింతగా ఉంది. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారు. అదంతా తమ క్రెడిట్ అన్నట్టు భావిస్తున్నారు. ఎప్పుడో ఒక అభిమాని విజయ్ కు జగన్ ఫోటో తో కూడిన చిత్రపటం ఇవ్వగా.. దానిని ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. ఏదో పెళ్లి వేడుకలో జగన్మోహన్ రెడ్డి పక్కనే విజయ్ కూర్చున్న ఫోటోలు సైతం వైరల్ చేస్తున్నారు. అదే స్టాలిన్ గెలిచి ఉంటే ఆయనతో ఉన్న ఫోటోను, పాత వీడియోను వైరల్ చేసేవారు. పళని స్వామి గెలిచి ఉంటే.. ఆయనతో జగన్ దిగిన పాత ఫోటోను తెరమీదకు తెచ్చేవారు. వారి అంతిమ లక్ష్యం జగన్ ను ఎలివేట్ చేయడం. మా అధినేతకు ఇంత ఇమేజ్ ఉందని చెప్పే ప్రయత్నం చేయడం. ఒకవేళ వైట్ హౌస్ లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ట్రంప్ చూసి ఉంటే మరో రకంగా ప్రచారం చేసేవారేమో.

* స్టాలిన్ తో ప్రత్యేక సంబంధాలు
స్టాలిన్ తో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) సంబంధాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే పక్క రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలకు పెద్దగా సంబంధం ఉండదు ఎవరికి. సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగతంగా విభేదించే కొనేవారు కాదు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఇలా వ్యక్తిగత వైరం అనేది కొనసాగుతోంది. కానీ పక్క రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం స్నేహం చేసే రోజులు ఇవి. స్టాలిన్ ఒకప్పటి చంద్రబాబు స్నేహితుడు కరుణానిధి కుమారుడు. అలా అయితే చంద్రబాబు స్టాలిన్ గురించి గొప్పగా చెప్పుకోవాలి. కానీ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డితో స్నేహంగా మెలిగే వారు. అలాగని చంద్రబాబు ఎప్పుడు స్టాలిన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. ఎన్డీఏ పరంగా వ్యతిరేకించేవారు. అయితే అదే స్టాలిన్ తో మొన్నటి వరకు స్నేహం చేసి.. తన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రోజాను డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేయించి.. ఇప్పుడు విజయ్ గెలవడంతో తన వాడే అన్నట్టు ఎలివేషన్ ఇప్పించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.

* ఇంతకుముందే అద్భుత విజయాలు..
ఒక్క మాట వైసీపీ శ్రేణులు గుర్తించుకోవాలి. విజయ్ ( Vijay) కంటే పుష్కరకాలం ముందటే మంచి విజయాన్ని దక్కించుకున్నారు జగన్. 2019లో అయితే అంతులేని మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే వైసిపి ఇమేజ్ ఏంటో ఎవరికి అంతుపట్టడం లేదు. ఎందుకు అంత భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డిని చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో విజయ్ కలిశారు. అప్పటికి జగన్ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. విజయ్ మాత్రం అంచనాలు లేని ఒక నాయకుడు. సహజంగానే కలిస్తే అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. అయితే ప్రాణ స్నేహితులుగా అన్నట్టు ఇప్పుడు వైసీపీ బిల్డప్ ఇస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా వచ్చి విజయ్ మాట్లాడిన సందర్భాలు లేవు. విజయ్ సినిమా ఫంక్షన్లకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు హాజరైన పరిస్థితి లేదు. కనీసం విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా పలకరించిన దాఖలాలు లేవు జగన్. ఏదైనా ఉంటే స్టాలిన్ తోనే ఉండేది జగన్ మోహన్ రెడ్డికి. కానీ ఒకే ఒక్క గెలుపు విజయ్ ను, జగన్మోహన్ రెడ్డిని ప్రాణ స్నేహితుడిని చేసేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper