Homeఎంటర్టైన్మెంట్Venkatesh And Kalyan Ram: రేపే మొదలు కానున్న వెంకటేష్ - కళ్యాణ్ రామ్ -...

Venkatesh And Kalyan Ram: రేపే మొదలు కానున్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి మూవీ..టైటిల్ ఏంటి ఇలా ఉంది..

Venkatesh And Kalyan Ram: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో ఒక మల్టీ స్టార్రర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్నాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , హీరోయిన్స్ కీర్తి సురేష్ , కృతి శెట్టి వంటి వారితో పాటు , డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు ఇతర నటీనటులు , టెక్నీషియన్స్ అందరూ కూడా రేపటి ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా విచ్చేసి , ముహూర్తపు షాట్ కి క్లాప్ కొడుతాడనే టాక్ ఉంది కానీ , మేకర్స్ నుండి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

అనిల్ రావిపూడి సినిమా అంటే, కచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అనేది మెంటల్ గా జనాలు కూడా ఫిక్స్ అయిపోతారు అనేది అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమాని జనవరి 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కాదు ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘జనవరి 13న విడుదల’ అని లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది చాలా ఓవర్ గా ఉంది కదూ, ఇంకెన్ని రోజులు ఇలాంటి సంక్రాంతి సెంటిమెంట్ టైటిల్స్ పెడుతావు?, ఆడియన్స్ కి ఎదో ఒకరోజు విసుగు వచేస్తాది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అనిల్ రావిపూడి ని ట్యాగ్ చేసి మండిపడుతున్నారు. మరి టైటిల్ నిజంగా అదేనా?, లేదా భవిష్యత్తులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది చూడాలి. ఈమధ్య కాలం లో అనిల్ రావిపూడి తన సినిమాలకు వరుసగా భీమ్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఆయన జీవీ ప్రకాష్ కుమార్ ని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. దీనికి కూడా రీసెంట్ గానే తన క్రియేటివ్ ప్రమోషనల్ బ్రెయిన్ తో , అనిల్ ఎంతటి ఫన్నీ పద్దతిలో ప్రకటించాడో మనమంతా చూశాము. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఇంకా ఎంతటి హైప్ క్రేజ్ క్రియేట్ అవుతుందో చూడాలి. తనకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ , వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన వెంకటేష్ లతో కలిసి చేయబోతున్న ఈ మల్టీస్టార్రర్ చిత్రం అనిల్ రావిపూడి కి ఎంతో స్పెషల్, దీనిని ఏ లెవెల్ కి తీసుకెళ్తాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper