Homeఎంటర్టైన్మెంట్Samantha Maa Inti Bangaram Movie: సొంత భర్త ముందు సమంత పరువు తీసేసిన...

Samantha Maa Inti Bangaram Movie: సొంత భర్త ముందు సమంత పరువు తీసేసిన యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న వీడియో..

Samantha Maa Inti Bangaram Movie: కొంత గ్యాప్ తర్వాత సమంత మన ముందుకు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం తో ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రానికి కథ సమంత భర్త రాజ్ నిడిమోరు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా సమంత నాన్ స్టాప్ గా మూవీ […]

Samantha Maa Inti Bangaram Movie: కొంత గ్యాప్ తర్వాత సమంత మన ముందుకు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం తో ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రానికి కథ సమంత భర్త రాజ్ నిడిమోరు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా సమంత నాన్ స్టాప్ గా మూవీ టీం తో కలిసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు , ఎక్కడ చూసినా ఈమె మాత్రమే కనిపిస్తోంది. ఆ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది సమంత. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ సుమ పాపం సమంత పరువు ని తీసినంత పని చేసింది. అది కూడా స్వయంగా తన భర్త రాజ్ నిడిమోరు ముందే జరగడం గమనార్హం.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సమంత కొన్ని కమర్షియల్ యాడ్ వీడియోస్ లో నటించింది. అప్పటికి ఆమెకు వయస్సులు కేవలం 16 ఏళ్ళు మారమేనంట. ముఖం అసలు గుర్తు పట్టలేని విధంగా ఉంది. దీన్ని చూసి రాజ్ నిడిమోరు కూడా షాక్ కి గురయ్యాడు. ఇది ఇప్పటి వరకు నేను కూడా చూడలేదే , ఎప్పటిది ఇది అంటూ సమంత వైపు చూసి ప్రశ్నించగా , ఆమె తల దించుకొని పగలబడి నవ్వుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సమంత ఫన్నీ మూమెంట్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే ఈ చిత్రం గురించి ఆమె రివీల్ చేసిన కొన్ని విషయాలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మా నిర్మాణ సంస్థ ద్వారా బలమైన లేడీ ఓరియెంటెడ్ సినిమాలను అందించడమే మా టార్గెట్ అని , అందులో భాగంగానే ఈ సినిమాని తీసినట్టు చెప్పుకొచ్చింది.

అంతే కాదు , ఈ చిత్రం కథ ని తన భర్త రాజమౌళి సాయి పల్లవి కోసం రాసుకున్నది , ఈ కథ నేను విన్న తర్వాత సాయి పల్లవి చేస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ ఆమె చాలా బిజీ గా ఉండడంతో డేట్స్ సర్దుబాటు అవ్వలేదు, దీంతో కొన్ని మార్పులు చేసే నేనే హీరోయిన్ గా నటించాల్సి వచ్చింది అట. ఈ విషయాన్ని స్వయంగా సమంత నే చెప్పుకొచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా , సమంత కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ఆమె రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకుంది , నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 1 లక్షా 50 వేల గ్రాస్ వసూళ్లు , అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by low_budget_logic (@low_budget_logic)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper