Homeఎంటర్టైన్మెంట్Uppal Balu: ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకంటే...

Uppal Balu: ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకంటే ఎక్కువ!

Uppal Balu: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న పేరు ‘ఉప్పల్ బాలు’. ఎక్కడ చూసినా ఈయనకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ని అనుసరించే ప్రతీ ఒక్కరికి ఉప్పల్ బాలు గత 8 ఏళ్ళ నుండి సుపీరిచితమే. కానీ రీసెంట్ గా ఆయన ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ లో పాల్గొనడం, అక్కడ జడ్జీలు ఈయన్ని ఘోరంగా అవమానించడం, దాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ , విశ్లేషకులు […]

Uppal Balu: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న పేరు ‘ఉప్పల్ బాలు’. ఎక్కడ చూసినా ఈయనకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ని అనుసరించే ప్రతీ ఒక్కరికి ఉప్పల్ బాలు గత 8 ఏళ్ళ నుండి సుపీరిచితమే. కానీ రీసెంట్ గా ఆయన ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ లో పాల్గొనడం, అక్కడ జడ్జీలు ఈయన్ని ఘోరంగా అవమానించడం, దాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ , విశ్లేషకులు తప్పుబడుతూ ఉప్పల్ బాలు కి సపోర్ట్ గా నిలబడడం, ఇలా వరుస ఈవెంట్స్ ఈయన చుట్టూనే గత నాలుగు రోజులుగా జరుగుతూ ఉన్నాయి. అంతే కాకుండా జడ్జి గా వ్యవహరించిన నవదీప్ పై ఆరోపణలు చేస్తూ ఉప్పల్ బాలు రోజుకి ఒక వీడియో ని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుండడం కూడా సంచలనంగా మారింది.

నాకు నవదీప్ ఎట్టి పరిస్థితిలోనూ సమాధానం చెప్పాల్సిందే, అప్పటి వరకు నేను అతన్ని వదలను అంటూ ఉప్పల్ బాలు సోషల్ మీడియా లో ఒక పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఉప్పల్ బాలు అసలు ఏమి చేస్తున్నాడు?, అతని నెల సంపాదన ఏ రేంజ్ లో ఉంటుంది? అనే సందేహం ప్రతీ ఒకరికి ఉండొచ్చు. రీసెంట్ గా ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన నెల సంపాదన గురించి చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా హియా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నానని , అందుకు గాను వాళ్ళు నెలకు నాకు 80 నుండి లక్ష రూపాయిల వరకు డబ్బులు ఇస్తున్నారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాని , జీవితం ఇప్పుడు చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు.

కేవలం హియా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే వచ్చే డబ్బులు మాత్రమే కాకుండా, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా ఉప్పల్ బాలు భారీగానే సంపాదిస్తున్నాడు. ‘బిగ్ బాస్’ షోలోకి రావాలని చాలా పెద్ద కలలే కన్నాడు. నేరుగా సెలబ్రిటీ లీగ్ లోనే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన్ని ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ కి పిలవడమే పెద్ద షాక్ అనుకుంటే , ఆడిషన్స్ సమయంలోనే ఎలాంటి టాస్కులు నిర్వహించకుండా ఎలిమినేట్ చేయడం మరో పెద్ద షాక్. ఒకవేళ ‘బిగ్ బాస్ 10’ లోకి ఉప్పల్ బాలు వచ్చి ఉండుంటే , కచ్చితంగా ఆయన కెరీర్ లో పెద్ద మలుపు చోటు చేసుకొని ఉండేది. చేతినిండా స్టార్ మా ఛానల్ లోని ఈవెంట్స్ తో ఫుల్ బిజీ గా గడిపేవాడు, పాపం బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper