Mulugu Forests: దట్టమైన అడవులకు ప్రసిద్ధి ములుగు జిల్లా. ఈ ప్రాంతంలో ప్రసిద్ధమైన సమ్మక్క సారలమ్మ.. బోగత జలపాతం.. గోదావరి నది ప్రవాహం.. ఇంకా అనేక రకాల ప్రకృతి ప్రసాదించిన వింతలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో జీవవైవిద్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి రూపొందించిన అనేక వింతలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఏడాది పొడవునా పర్యాటకులు వస్తూనే ఉంటారు.
దట్టమైన అడవులకు పేరుగాంచిన ములుగులో అసాధారణమైన విధ్వంసం కొనసాగుతోంది. ఇది పర్యావరణ శాస్త్రవేత్తలను.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ వందల సంవత్సరాల నాటి మహావృక్షాలు కూడా క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి. వరుసగా ఈ సంఘటనలు జరగడంతో అడవి స్వరూపం పూర్తిగా మారిపోతుంది. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఈ దారుణాలు రెండుసార్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రెండు సంవత్సరాల క్రితం..
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 31న తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో రాకాసి గాలులు వీచాయి. ఈ ప్రమాదంలో దాదాపు విస్తారమైన వృక్షాలు నేల కూలిపోయాయి. ఈ నష్టం నుంచి ఇంకా తే రుకోక ముందే, గత ఏడాది జూలై 28న మంగపేట మండలం కోమటిపల్లి పరిధిలో అడవుల్లో పెను విధ్వంసం జరిగింది. కొద్ది నిమిషాల పాటు భారీగా గాలి వీచింది. ఈ ప్రమాదంలో పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
ఎందుకు ఇలా జరుగుతుంది
ఇలా విధ్వంసం జరగడానికి టోర్నడో.. డౌన్ బర్డ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకేసారి భారీగా గాలివీస్తే దానిని టోర్నడో అంటారు. క్యుములోనింబస్ మేఘాల నుంచి చల్లటి గాలి ఒకసారిగా అత్యంత వేగంతో భూమిని తాకడం.. అది నాలుగు దిశల విస్తరిస్తే దానిని డౌన్ బర్డ్స్ అని పిలుస్తుంటారు. ఇటువంటి వాటివల్లే ములుగు జిల్లాలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే వీటిపై పూర్తిగా క్లారిటీ రావాలంటే శాస్త్రీయ అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి వీచిన వేగం.. ప్రయాణించిన మార్గం.. నేల కూలిపోయిన వృక్షాల నమూనాలు.. డాప్లర్ రాడార్ సమాచారం వంటి ఆధారంగా వీటిని విశ్లేషించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ తరహా విపత్తుల వల్ల సహజ ఆవాసాలు పూర్తిగా నాశనం అవుతాయని.. పర్యావరణం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సం… నేలకూలిన 118 భారీ వృక్షాలు
తాడువాయి రేంజ్ అటవీ ప్రాంతంలో టోర్నాడో తరహా సుడిగాలికి ఒకటిన్నర హెక్టార్లలో చెట్లు నేలమట్టం.
డ్రోన్ల ద్వారా సర్వే చేసి 118 భారీ చెట్లు కూలినట్లు గుర్తించిన డిఎఫ్ఓ వికాస్ మీనా.
భారీ వర్షాల అనంతరం పర్యాటకుల… pic.twitter.com/Adc7kS7VIu
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) August 3, 2026