Pawan Kalyan: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేసిన పేరు ప్రశ్న రావణ్. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అసభ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన గతం లో చేసిన వీడియోల ఆధారంగా , ఉపా చట్టం క్రింద కేసు నమోదు చేసి , ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలు కి తరలించారు. మొదట్లో అరెస్ట్ అయ్యినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రశ్న రావణ్ కి సపోర్టుగా నిలిచారు కానీ , ఆ తర్వాత ఆయన చేసిన వీడియోలు చూసాక అతని వైపు నిలబడడం ఆపేశారు. గత రెండు నెలల నుండి నెల్లూరు సెంట్రల్ జైలు లోనే ఉంటున్న రావణ్ రిమాండ్ ని ఈ నెల 22 వ తేదికి పొడిగించారు.
అయితే రీసెంట్ గా కోర్టులో ఆయన జడ్జీ ముందు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తప్పు అయిపోయింది , అవసరమైతే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తాను , ఇక నన్ను వదిలేయండి అని జడ్జి ముందు ప్రాధేయపడ్డాడు అట. కానీ ఆయన చేసిన సంఘ విద్రోహక వీడియోలు ఆధారాలతో సహా ఉండడం తో, కోర్టు ఇతనికి బైలు మంజూరు చేయడానికి నిరాకరిస్తోంది. ముఖ్యంగా ఇతనికి సపోర్టుగా నిల్చిన వాళ్లంతా నేడు సైలెంట్ అయిపోయారు. రావణ్ అరెస్ట్ అయిన కొత్తల్లో అతనికి సపోర్టు చేస్తూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్ని వీడియోలు చేసాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రావణ్ ని పట్టించుకోవడం లేదు. కనీసం ములాఖత్ కి వచ్చి రావణ్ ని కలవలేదు కూడా. అంతే కాదు రావణ్ కి సపోర్టుగా నిల్చిన కొన్ని యూట్యూబర్స్ తమ వీడియోలను కూడా డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే రావణ్ చేసిన కంటెంట్ అలాంటిది మరీ. అందుకే అతన్ని ఎవ్వరూ ఈ కేసు నుండి బయటకు తీసుకొని రాలేకపోతున్నారు. అరెస్ట్ చేసిన కొత్తల్లో , ఒక వారం రోజుల వరకు సోషల్ మీడియా లో ఈ అంశం పై హడావిడి సాగింది. కాలక్రమేణా జనాలు ఈ అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయం లో రావణ్ గురించి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి రాబోయే రోజుల్లో రావణ్ బెయిల్ మీద రిలీజ్ అవుతాడా?, లేదా నాలుగేళ్ల వరకు జైలులోనే గడుపుతాడా అనేది చూడాలి.