Bigg Boss 10 Telugu : రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 10’ షో అత్యంత భారీ అంచనాల నడుమ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు అందుకునే లాగానే, హౌస్ లో టాస్కులు డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. ఇప్పటి వరకు మనం చూసిన సీజన్స్ వేరు, ఈ సీజన్ వేరు. హౌస్ లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన మొదటి రోజే, వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ టాస్కులు ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. నేడు చూడబోయే ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. టాస్కులతో పాటు , నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా హీట్ మీద జరిగాయి. ఈ ప్రక్రియ లో ఎవరిది తప్పు , ఎవరిది కరెక్ట్ అనేది తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఈ షో మొదలయ్యే ముందు సోషల్ మీడియా లో కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి.
ఒక వీడియో లో ‘గుప్పెడంత మనసు’ హీరో బాలు కూడా ఉండడాన్ని చూసిన నెటిజెన్స్, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడా? అని అంతా అనుకున్నారు. కానీ ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి గల అసలు కారణం ఏంటో నిన్న తెలిసింది. బాలు , మీనా లు కలిసి ‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి అడుగుపెట్టి హోమ్ టూర్ చేస్తారు. ముందుగా మీనా బాలు కి సర్ప్రైజ్ ఇస్తూ , బిగ్ బాస్ హౌస్ కి తీసుకొస్తుంది. ఇప్పటికే ‘బిగ్ బాస్’ కి రావడం లేదని చెప్పాను, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ బాలు క్యూట్ గా మీనా ని అడగడం చూసేందుకు చాలా బాగా అనిపించింది. ‘బిగ్ బాస్’ హౌస్ లో టాస్కులు మనం ఆడలేము, కానీ చూసి ఎంజాయ్ చేయగలము అని అంటాడు బాలు.
ఇదంతా పక్కన పెడితే, బాలు ఇప్పటి వరకు బిగ్ బాస్ లోకి రాలేదు , భవిష్యత్తులో వస్తాడో లేదో తెలియదు కానీ, మీనా క్యారెక్టర్ చేసిన అమూల్య మాత్రం ‘బిగ్ బాస్’ షో లో పాల్గొన్నది. కన్నడ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బిగ్ బాస్ 9’ లో ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. టాప్ 5 లో నిలవలేదు కానీ , హౌస్ లో 90 రోజుల వరకు ఉంది. అప్పట్లో ఈమె టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది కానీ , ఇప్పుడు మాత్రం ఎంట్రీ ఇస్తే , కచ్చితంగా ఈమె లేడీ టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే బాలు , మీనా లు కలిసి చేసిన ‘బిగ్ బాస్ 10’ హోమ్ టూర్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.