Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఝాన్సీ. రైతు బిడ్డని అంటూ తనని తాను పరిచయం చేసుకున్న ఝాన్సీ, మరో పల్లవి ప్రశాంత్ లాగా సింపతీ డ్రామా చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా సింపతీ చూపించకుండా, తన అద్భుతమైన ఆట తీరుతో ‘టికెట్ టు బిగ్ బాస్’ గెలుచుకొని , ఈ సీజన్ సామాన్యుల క్యాటగిరీ లో ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి కంటెస్టెంట్ గా నిలిచి ఆమె చరిత్ర తిరగరాసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ‘అగ్ని పరీక్ష 2’ లో ఈమె గురించి కంటెస్టెంట్స్ చెప్పిన కొన్ని మాటలకు, హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆమె ప్రవర్తిస్తున్న తీరుకు చాలా మ్యాచింగ్ జరిగింది అనే చెప్పాలి.
ఝాన్సీ గెలిచే వాళ్ళతోనే ఉంటుంది , గెలవని కంటెస్టెంట్స్ ముఖం వైపు కూడా చూడడు అని ‘అగ్ని పరీక్ష 2’ లో చాలా మంది కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమెని చూస్తుంటే ‘అగ్ని పరీక్ష 2’ లో చెప్పింది నిజమేనని అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన క్షణం నుండి , ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ తో అసలు ఉండడం లేదు. కనీసం వాళ్ళ ముఖం వైపు కూడా చూడడం లేదు. ఆటో రామ్ ప్రసాద్ , త్రిగున్ , వర్షిణి, నరేష్ వంటి టాప్ సెలబ్రిటీస్ చుట్టూనే తిరుగుతోంది. ఆటో రామ్ ప్రసాద్, త్రిగున్ తమ మొదటి టాస్కుల్లో చాలా అద్భుతంగా ఆడారు, ఇది గమనించడం వల్లే ఝాన్సీ వాళ్ళతో ఉంటుందని అనిపిస్తోంది. రోహిత్, అమన్ లు ఇచ్చిన టాస్కులు పూర్తి చేయలేదు, రోహిత్ అయితే మొదటి టాస్క్ లో ఓడిపోయాడు.
ఇక చరణ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అగ్ని పరీక్ష 2’ లో పెర్ఫార్మన్స్ లేదు, హౌస్ లోకి వచ్చిన తర్వాత అసలు యాక్టీవ్ గా లేడు . ఇలాంటోళ్ళతో ఉంటే ముందుకు వెళ్లలేము అనే స్ట్రాటజీ తో ఝాన్సీ చాలా తెలివిగా సెలబ్రిటీల వైపు ఉందని, ‘అగ్ని పరీక్ష 2’ లో కంటెస్టెంట్స్ ఆమె గురించి చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని అనిపిస్తోంది. అంతే కాదు , టాస్కులు అయితే చాలా బలంగా ఝాన్సీ ఆడగలదు కానీ , హౌస్ లోని వాతావరణం కి ఆమె ఎందుకో సూట్ అవ్వదని అనిపిస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఒకవేళ రోహిత్ , అమన్ బ్యాచ్ గెలిస్తే, ఈమె వాళ్ళ వైపుకు వస్తుందా అనేది కూడా చూడాలి.