Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu:ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్...

Bigg Boss 10 Telugu:ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అవుట్..

Bigg Boss 10 Telugu: మొదటి వారమే కంటెస్టెంట్స్ కి గేమ్ ని చాలా టఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్ లోకి వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్ అందరికీ టాస్కులు పెట్టడం, వాళ్ళ చేతుల్లో పవర్ కీస్ పెట్టడం వంటివి అందులో భాగమే. మొత్తం మీద 10 మంది కంటెస్టెంట్స్ చేతుల్లో పవర్ కీస్ ఉన్నాయి. వీటితో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ ‘మహా పరీక్ష’ అనే కొత్త […]

Bigg Boss 10 Telugu: మొదటి వారమే కంటెస్టెంట్స్ కి గేమ్ ని చాలా టఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్ లోకి వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్ అందరికీ టాస్కులు పెట్టడం, వాళ్ళ చేతుల్లో పవర్ కీస్ పెట్టడం వంటివి అందులో భాగమే. మొత్తం మీద 10 మంది కంటెస్టెంట్స్ చేతుల్లో పవర్ కీస్ ఉన్నాయి. వీటితో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ ‘మహా పరీక్ష’ అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ తీసుకొచ్చాడు. ఈ మహాపరీక్ష లో గెలిచిన వాళ్ళే హౌస్ మేట్స్ అవుతారు. మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్ లో ఉంటారు. అంటే నామినేషన్స్ లో అన్నమాట. కంటెస్టెంట్స్ మధ్య ఎప్పటి లాగానే నామినేషన్స్ ప్రక్రియ ని నిర్వహించారు, చాలా హీట్ వాతావరణం లో ఈ ప్రక్రియ జరిగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ నామినేట్ చేస్తాడు.

వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టీ చూస్తే, ఇప్పుడు ఉన్న వారిలో కృష్ణుడు కి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతర కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈయనకు కాస్త ఫాలోయింగ్ తక్కువ. సినిమాలకు దూరమై చాలా రోజులైంది, అందుకే ఈయనకు ఆడియన్స్ తో కనెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఈయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఈయనపై మంచి అభిప్రాయం ఉంది. ఒకరి దగ్గర నామినేషన్స్ నుండి సేవ్ చేసే పవర్ కూడా ఉంది. ఒకవేళ ఆ పవర్ ని ఉపయోగిస్తే, కృష్ణుడు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కృష్ణుడు తర్వాత తక్కువ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ చైత్ర.

ఈమెకు ఒకపుడు సీరియల్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉండేది కానీ , ఈమధ్య బాగా గ్యాప్ రావడం తో , ఆడియన్స్ కి దూరమైంది. పైగా హౌస్ లో ఇప్పటి వరకు తన మార్క్ చూపించలేకపోయింది. కాబట్టి ఈమెకు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ఎవ్వరూ ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే , అలాంటి ప్లానింగ్ చేసాడు బిగ్ బాస్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper