OnePlus 16 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం OnePlus 15కి కొనసాగింపుగా OnePlus 16పై టెక్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించకపోయినా.. వరుస లీకులు, టిప్‌స్టర్ల సమాచారంతో కీలక స్పెసిఫికేషన్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ బ్యాటరీ, అత్యధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో OnePlus 16 ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
9,000mAh భారీ బ్యాటరీ
టిప్‌స్టర్ Digital Chat Station Weiboలో వెల్లడించిన సమాచారం ప్రకారం OnePlus 16లో ఏకంగా 9,000mAh బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. OnePlus 15లో ఉన్న 7,300mAh బ్యాటరీతో పోలిస్తే ఇది గణనీయమైన అప్‌గ్రేడ్.
బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కాకుండా పవర్ ఎఫిషియన్సీపై కూడా వన్‌ప్లస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. Oppo అభివృద్ధి చేసిన ఎనర్జీ ఎఫిషియెంట్ చిప్‌ను ఫోన్‌లో ఉపయోగించవచ్చని, ఇది తక్కువ వోల్టేజ్ డిశ్చార్జ్‌కు సపోర్ట్ చేస్తుందని టిప్‌స్టర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
185Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
OnePlus 16లో మరో ప్రధాన ఆకర్షణ డిస్‌ప్లే కానుంది. ఈ ఫోన్‌లో 185Hz వరకు రిఫ్రెష్ రేట్ అందించే స్క్రీన్‌ను తీసుకురావచ్చని లీకులు సూచిస్తున్నాయి. OnePlus 15లో 165Hz AMOLED డిస్‌ప్లే ఉన్న నేపథ్యంలో కొత్త మోడల్‌లో రిఫ్రెష్ రేట్‌ను మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది.
లీక్‌ల ప్రకారం OnePlus 16లో 6.78 అంగుళాల కస్టమ్ BOE Oriental Screen 4.0 డిస్‌ప్లే ఉండవచ్చు. ఇందులో X4 లుమినసెంట్ మెటీరియల్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా గేమింగ్, స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపించే అవకాశం ఉంది.
Snapdragon 8 Elite Gen 6 Pro
పనితీరు విషయానికి వస్తే OnePlus 16 మరింత శక్తివంతంగా ఉండనుంది. ఈ ఫోన్‌లో Qualcommకు చెందిన Snapdragon 8 Elite Gen 6 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చని టిప్‌స్టర్లు చెబుతున్నారు. ఈ చిప్ కారణంగా హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత ఫీచర్లు, వీడియో ఎడిటింగ్ వంటి పనుల్లో మెరుగైన పనితీరు లభించే అవకాశం ఉంది.
200MP కెమెరా.. ట్రిపుల్ కెమెరా సెటప్
కెమెరా విభాగంలోనూ OnePlus 16 భారీ అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశం ఉంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చని సమాచారం. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. OnePlus 15లోని 50MP ప్రధాన కెమెరాతో పోలిస్తే ఇది పెద్ద మార్పు.
ప్రైమరీ కెమెరాకు తోడు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అందించే అవకాశం ఉంది.
ధర, లాంచ్ వివరాలు
OnePlus 16 చైనాలో అక్టోబర్‌లో అధికారికంగా విడుదల కావచ్చని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. ధర విషయానికి వస్తే.. గతంలో వచ్చిన లీక్‌ల ప్రకారం ఈ ఫోన్ ప్రారంభ ధర CNY 4,999, అంటే సుమారు రూ.71,000 ఉండవచ్చని అంచనా.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే OnePlus 16 చైనాలో ColorOS 17తో రావచ్చని సమాచారం. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకులు, అంచనాల ఆధారంగానే ఉన్నాయి. OnePlus అధికారికంగా స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీని ప్రకటించే వరకు వీటిని ఖచ్చితమైన వివరాలుగా పరిగణించకూడదు. భారీ 9,000mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరా వంటి ఫీచర్లు నిజమైతే మాత్రం OnePlus 16 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.