Toxic Censor Review: కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలు పెట్టిన యశ్ కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చేవారం రిలీజ్ కి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులైతే పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో కొన్ని బోల్డ్ సన్నివేశాలు, వైలెన్స్ సీన్స్ ఉండటం వల్ల దానికి ఈ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలియజేశారు. ఇక సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో యశ్ చాలా అద్భుతంగా కనిపించారని చెబుతున్నారు. పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్లలో కూడా తన నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నాయంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఈ సినిమాకి అద్భుతంగా ఉండబోతుందని బోర్డు మెంబర్స్ చెప్తున్నారు. మరి వాళ్ళు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నట్టుగానే తెలుస్తుంది. మొత్తానికైతే గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించిందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా యశ్ ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తూ ఇండియా వైడ్ గా మరోసారి తన పేరు మారుమ్రోగిపోయేలా చేయబోతున్నాడు అంటూ సెన్సార్ బోర్డు వాళ్ళు సైతం చెబుతున్నారు…అలాగే ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు 5 కి 3 రేటింగ్ ఇవ్వడం విశేషం…
మొత్తానికైతే టాక్సిక్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో తెలియాలంటే మరో వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…ఇక యశ్ తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రామాయణం సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న ఆయన మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది…