Homeఎంటర్టైన్మెంట్Dil Raju And Rajamouli: దిల్ రాజు బ్యానర్ లో రాజమౌళి మూవీ చేయకపోవడానికి ఆ...

Dil Raju And Rajamouli: దిల్ రాజు బ్యానర్ లో రాజమౌళి మూవీ చేయకపోవడానికి ఆ రోజు జరిగిన సంఘటనే కారణమా…

Dil Raju And Rajamouli: ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే మొదటగా మంచి కథ అయితే ఉండాలి. దానిని చిత్రీకరించడానికి ఒక దర్శకుడు కావాలి. దానికి డబ్బులు పెట్టడానికి ఒక ప్రొడ్యూసర్ ఉండాలి. వీళ్ళందరు ఉన్నప్పుడే ఒక సినిమా సెట్స్ మీదకి వస్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాలో ప్రొడ్యూసర్ పాత్ర చాలా కీలకమైనది. […]

Dil Raju And Rajamouli: ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే మొదటగా మంచి కథ అయితే ఉండాలి. దానిని చిత్రీకరించడానికి ఒక దర్శకుడు కావాలి. దానికి డబ్బులు పెట్టడానికి ఒక ప్రొడ్యూసర్ ఉండాలి. వీళ్ళందరు ఉన్నప్పుడే ఒక సినిమా సెట్స్ మీదకి వస్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాలో ప్రొడ్యూసర్ పాత్ర చాలా కీలకమైనది. ఆయన పెట్టే బడ్జెట్ ను బట్టి సినిమా క్వాలిటి అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దిల్ రాజు ఎప్పుడు కూడా క్వాలిటి విషయంలో ఎక్కడ నెగ్లెట్ చేయలేదు. సినిమాని అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి… ఒక సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఆయన ముందుగానే గెస్ చేస్తూ ఉంటారు. అందుకే సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఆయన చాలా వరకు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తూ సినిమా క్వాలిటి చెడిపోకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. దిల్ రాజు చాలా సందర్భాల్లో రాజమౌళితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.

కానీ రాజమౌళి మాత్రం దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కారణం ఏంటంటే రాజమౌళి కెరియర్ ను స్టార్ట్ చేసినప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడనే విషయం తెలుసుకున్న రాజమౌళి దిల్ రాజుకి ఒక కథని వినిపించారట. ఆ కథ ను దిల్ రాజు రిజెక్ట్ చేశాడు.

దాంతో రాజమౌళి తీవ్రమైన మనస్థాపానికి గురయ్యారట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ మధ్య మాటలైతే ఉన్నాయి. కానీ రాజమౌళి మాత్రం దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయకూడదని అనుకున్నాడనే ఒక వార్త అప్పట్లో ఫిలిం నగర్ సర్కిల్ లో ఎక్కువగా వినిపించేది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక దిల్ రాజు సైతం మినిమం బడ్జెట్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళ్తాడు. భారీ బడ్జెట్ మూవీస్ చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కోసం 500 కోట్ల బడ్జెట్ ను పెట్టటం ఆ సినిమా డిజాస్టర్ గా మారడం తో దిల్ రాజు చాలా వరకు నష్టాన్ని చవి చూశాడు. మరి అలాంటి దిల్ రాజు తనకు అందుబాటులో ఉన్న బడ్జెట్లోనే వెళ్తాడు అంతే తప్ప ఎక్కువ బడ్జెట్ ను సినిమాల మీద పెట్టే అవకాశమైతే లేదనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper