Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Agnipariksha2: కంటెస్టెంట్ 'ఎక్స్ బాయ్ ఫ్రెండ్' కి ప్రపోజ్ చేయించిన 'అగ్నిపరీక్ష 2'...

Bigg Boss Agnipariksha2: కంటెస్టెంట్ ‘ఎక్స్ బాయ్ ఫ్రెండ్’ కి ప్రపోజ్ చేయించిన ‘అగ్నిపరీక్ష 2’ జడ్జీలు..వీడియో వైరల్..

Bigg Boss Agnipariksha2: ఇప్పటి వరకు ప్రసారమైన ‘అగ్నిపరీక్ష 2’ ఎపిసోడ్స్ లో , నిన్నటి ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఆడిషన్స్ ముగిసిన తర్వాత ‘డేర్ ఆర్ డై’ అనే కాన్సెప్ట్ మీద పలు టాస్కులు నిర్వహించారు. అందులో శ్రేష్టి వ్యాకరణం చేసిన డేర్ కి ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. ముందుగా శ్రీముఖి కంటెస్టెంట్స్ ని మీ బ్రేయాకప్ స్టోరీస్ ని చెప్పమని అంటుంది. అప్పుడు శ్రేష్టి వ్యాకరణం, దీపక్ సేనాపతి […]

Bigg Boss Agnipariksha2: ఇప్పటి వరకు ప్రసారమైన ‘అగ్నిపరీక్ష 2’ ఎపిసోడ్స్ లో , నిన్నటి ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఆడిషన్స్ ముగిసిన తర్వాత ‘డేర్ ఆర్ డై’ అనే కాన్సెప్ట్ మీద పలు టాస్కులు నిర్వహించారు. అందులో శ్రేష్టి వ్యాకరణం చేసిన డేర్ కి ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. ముందుగా శ్రీముఖి కంటెస్టెంట్స్ ని మీ బ్రేయాకప్ స్టోరీస్ ని చెప్పమని అంటుంది. అప్పుడు శ్రేష్టి వ్యాకరణం, దీపక్ సేనాపతి , రోహిత్ నాయుడు , గాయత్రీ వంటి కంటెస్టెంట్స్ తమ బ్రేకప్ స్టోరీస్ ని చెప్తారు. ఇక ఆ తర్వాత ఈ నలుగురికి తమ ‘ఎక్స్ లవర్స్’ కి ఫోన్ చేసి ‘నిన్ను బాగా మిస్ అవుతున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నాను , మన బ్రేకప్ లో తప్పు నాదే, మళ్లీ నిన్ను నా జీవితం లోకి ఆహ్వానిస్తున్నాను , దయచేసి నా లవ్ ని అంగీకరించవా’ అని అడగాలంటూ ఒక డేర్ ఇస్తుంది శ్రీముఖి.

ఈ డేర్ ని చేయడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు అని శ్రీముఖి అడగ్గా, నలుగురూ ఆ డేర్ చేయడానికి ముందుకొస్తారు. అప్పుడు జడ్జీలు మీ ముందు ఒక గంట పెడుతాము, ఎవరైతే ముందుగా వచ్చి ఆ గంటని పెట్టుకుంటారో , వాళ్ళు ఈ డేర్ ని చెయ్యాలి అని అంటారు. అందరికంటే ముందు రోహిత్ గంట పట్టుకుంటాడు. తన మాజీ ప్రేయసి కి ఫోన్ చేయగా, ఆమె లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత గాయత్రీ, దీపక్ లకు కూడా ఇదే పరిస్థితి ఎదురు అవుతుంది. చివరికి శ్రేష్టి వ్యాకరణం కి ఈ ఛాన్స్ వస్తుంది. ఫోన్ చేయగానే ఆమె మాజీ ప్రేమికుడు లిఫ్ట్ చేస్తాడు. ఏంటి సంగతి అని అడుగుతాడు. ఆ తర్వాత శ్రేష్టి శ్రీముఖి చెప్పినట్టుగానే , అన్ని చెప్పి , అతనికి ప్రపోజ్ చేస్తుంది.

అందుకు అతను సమాధానం గా ‘ఇవన్నీ అయిపోయింది. ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నాము, మళ్లీ ఇదంతా ఏంటి?’ అని చెప్పి సింపుల్ గా ఆమె ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఈ డేర్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినందుకు టాప్ 15 లోకి ఎంట్రీ ఇస్తుంది శ్రేష్టి. అయితే ఇది చాలా కఠినమైన టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎమోషన్స్ తో ముడిపడిన టాస్క్ ఇది. మనం బ్రేకప్ చెప్పిన అమ్మాయి లేదా అబ్బాయితో మాట్లాడేందుకే ఇబ్బంది పడుతాము , కనీసం ముఖం చూసేందుకు కూడా ఇష్టం చూపించము, అలాంటిది మన తప్పు లేకపోయినా , మన ఎక్స్ లవర్ కి ఫోన్ చేసి , ప్రపోజ్ చేసి , వాళ్ళ రెజెచ్తిఒన్ పొందితే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము, ఇలాంటి డేర్ చేసినందుకు శ్రేష్టి పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pushpa (@editsbypushparajuu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper