spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR -Dhanush : రేపే ఎన్టీఆర్ - ధనుష్ మూవీ ప్రారంభం.. ఫ్యాన్స్ కి ఇది...

NTR -Dhanush : రేపే ఎన్టీఆర్ – ధనుష్ మూవీ ప్రారంభం.. ఫ్యాన్స్ కి ఇది నిజంగా ఊహించని ట్విస్ట్

Tomorrow NTR-Dhanush movie starts : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా ఊపందుకుంది.ఒకప్పుడు సీనియర్ హీరోలు మరియు నేటి తరం హీరోలు కలిసి ఒక సినిమాలో నటించేవారు.కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేస్తున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యాలంటే దర్శకనిర్మాతలు భయపడేవారు.కానీ #RRR మూవీ సక్సెస్ తర్వాత ప్రతీ మేకర్ లోను మల్టీస్టార్ర్ర్ చేసే ధైర్యం వచ్చింది.సరికొత్త కాంబినేషన్ కోసం మన దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.

అలా రీసెంట్ గా ఎన్టీఆర్ – ధనుష్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యిందని, ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని.రేపే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు అంటూ తమిళ మీడియా నుండి ఒక వార్త సెన్సేషన్ సృష్టించింది.దీనితో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు, తమిళ టాప్ మీడియా చానెల్స్ కూడా ఈ విషయం పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది.

గ్రౌండ్ లెవెల్ లో న్యూస్ బాగా వ్యాప్తి చెందడం తో అప్రమత్తమైన ఎన్టీఆర్ టీం వెంటనే స్పందించింది.సోషల్ మీడియా లో గత కొద్దీ సేపటి నుండి ప్రచారం అవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.ఏదైనా న్యూస్ ఉంటె స్వయంగా మేమే తెలియజేస్తామని, దయచేసి వేరేవాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు.

దీనితో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది అనే వార్త తెలిసి, అది నిజం కాదని వెంటనే తెలియడం తో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.ఫేక్ వార్తలను ప్రచారం చేసిన వారిపై మండిపడ్డారు.యాక్టింగ్ కి పవర్ హౌస్ లాంటి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఒకే సినిమాలో చేస్తే చూడాలని ఉందని, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అటు ధనుష్ అభిమానులు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Oktelugu Epaper