spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kalki 2898 AD: కల్కి నుండి సడన్ సర్ప్రైజ్... లేటెస్ట్ వీడియో చూశారా?

Kalki 2898 AD: కల్కి నుండి సడన్ సర్ప్రైజ్… లేటెస్ట్ వీడియో చూశారా?

Kalki 2898 AD: ప్రభాస్ నటించిన కల్కి 2829 AD విడుదలకు సమయం దగ్గర పడింది. మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కల్కి చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ప్రమోషన్స్ కి రూ. 200 కోట్లు కేటాయించారని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 40 కోట్ల ఖర్చుతో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక కారును సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ బుజ్జి(కారు)ని తయారు చేయడానికి అవసరమైన సాంకేతికతను సమకూర్చారు. ఆయన ఇంజనీర్స్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి పని చేశారు.

వివిధ నగరాల్లో బుజ్జిని ప్రదర్శనకు పెడుతున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం బుజ్జిని డ్రైవ్ చేశాడు. ఇక జూన్ 10న విడుదలైన ట్రైలర్ మరొక ఎత్తు అని చెప్పాలి.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. నాగ్ అశ్విన్ ప్రతిభను పలువురు కొనియాడుతున్నారు. కల్కి ప్రభాస్ కెరీర్లో గొప్ప చిత్రం అవుతుందని ఫ్యాన్స్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్. ఓ ప్రమోషనల్ సాంగ్ సిద్ధం చేశారు. స్టార్ సింగర్ దిల్జీత్ ఈ పాటను పాడారు. కల్కి ప్రమోషన్స్ లో భాగంగా ఓ సాంగ్ ప్రత్యేకంగా షూట్ చేశారు. భైరవ యాన్తం పేరుతో వస్తున్న ఈ సాంగ్ లో ప్రభాస్, దిల్జీత్ భాగమయ్యారు. ప్రభాస్ లుక్ అదిరింది. నేడు కేవలం ప్రోమో విడుదల చేశారు. రేపు పూర్తి సాంగ్ అందుబాటులోకి రానుంది.

కల్కి మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రభాస్ భైరవ అనే సాహసోపేత పాత్ర చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో కల్కి తెరకెక్కింది. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

 

https://www.youtube.com/watch?v=gdvy35Uqafs

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper