Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Vijay Sethupathi: నయనతార భర్తకు ఫోన్ చేసి మండిపడ్డ విజయ్ సేతుపతి... ఆ సినిమా విషయంలో...

Vijay Sethupathi: నయనతార భర్తకు ఫోన్ చేసి మండిపడ్డ విజయ్ సేతుపతి… ఆ సినిమా విషయంలో ఇంత రచ్చ జరిగిందా!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి-విగ్నేష్ శివన్ మధ్య వివాదం నడిచిందట. విగ్నేష్ శివన్ కి విజయ్ సేతుపతి నేరుగా ఫోన్ చేసి నువ్వు నాకు నటన నేర్పుతున్నావా… అని మండిపడ్డాడట. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించాడు. విగ్నేష్ తో జరిగిన గొడవ వివరాలు బయటపెట్టాడు. 2015లో విడుదలైన నానుమ్ రౌడీ దాన్ సూపర్ హిట్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ఆర్ పార్తీబన్ విలన్ గా నటించారు. ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకుడు. ఈ మూవీ సెట్స్ లో విజయ్ సేతుపతితో విగ్నేష్ శివన్ కి విబేధాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తాజాగా అప్పటి వివాదం పై విజయ్ సేతుపతి స్పందించారు. ఆయన మాట్లాడుతూ… నానుమ్ రౌడీ దాన్ మూవీ షూటింగ్ మొదటి రోజే విగ్నేష్ శివన్ తో గొడవ జరిగింది. నేను విగ్నేష్ శివన్ కి కాల్ చేసి నువ్వు నాకు యాక్టింగ్ నేర్పుతున్నావా… అని అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పింది. వాస్తవానికి నేను విగ్నేష్ శివన్ ని సరిగా అర్థం చేసుకోలేదు. అతడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కొత్తగా అనిపించడంతో ఓకే చెప్పాను.

షూటింగ్ రోజు ఆయన సంతృప్తి పడేలా నేను నటించలేదు. నాలుగు రోజుల వరకు నా పాత్రను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు అభద్రతాభావానికి గురయ్యాను. ఒకరినొకరం అర్థం చేసుకున్నాక షూటింగ్ సాఫీగా సాగిపోయింది. విగ్నేష్ శివన్ టాలెంటెడ్ డైరెక్టర్. ఎవరు టచ్ చేయని కథలను గొప్పగా తెరకెక్కించగలడు. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం… అని అన్నారు.

కాగా ఈ సినిమా సెట్స్ లోనే విగ్నేష్ శివన్-నయనతార ప్రేమలో పడ్డారు. ఏళ్ల తరబడి డేటింగ్ చేశారు. 2022లో వివాహం చేసుకున్నారు. విగ్నేష్ శివన్-నయనతారలకు ఇద్దరు కవలలు. నయనతార సరోగసి పద్దతిలో పిల్లల్ని కన్నది. ఇది వివాదాస్పదం అయ్యింది. వారిపై విచారణ జరిగింది. తగు పత్రాలు, ఆధారాలు చూపించి ఈ కేసు నుండి నయనతార దంపతులు బయటపడ్డారు.

RELATED ARTICLES

Most Popular