spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Pushpa 2: వామ్మో అల్లు అర్జున్ సాంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా..

Pushpa 2: వామ్మో అల్లు అర్జున్ సాంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా..

Pushpa 2: పుష్ప పుష్ప రాజ్.. తగ్గేదేలే ఈ డైలాగ్ వెంటే వెంటనే అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించారు బన్నీ. ఇక పుష్ప సినిమాతో యూత్ ను ఉర్రూతలూగించారు. ఇందులోని పాటలు అదుర్స్ అనిపించుకున్నాయి. ఆ సినిమా పాటలు, డ్యాన్సులు, డైలాగులు దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేశాయి. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ పుష్ప: ది రూల్‌ ఫీవర్ నడుస్తోంది. దీని నుంచి ఇటీవల రిలీజైన ‘పుష్ప పుష్ప’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ డ్యాన్స్ మూవ్స్‌ను చాలామంది ఇన్ స్టాలో రీ క్రియేట్ చేస్తూ పోస్టు చేస్తున్నారు.

విదేశాల్లో కూడా.. ఈ పాటపై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు నెటిజన్లు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇప్పుడు అదే పనిపై బిజీగా ఉన్నారు. వీరందరిలోనూ.. ఒక మహిళ చీరలో ఈ హుక్ స్టెప్‌ను యాజిటీజ్ ఇరగదీసింది. సేమ్ బన్నీ గ్రేస్‌తో మూవ్స్‌ చేసింది. దీంతో ఈ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. బన్నీ ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నెటిజన్లు ఆమెను ‘లేడీ పుష్పరాజ్’గా అభివర్ణిస్తున్నారు.

మరి ఈ డాన్స్ చేసింది ఎవరు అనుకుంటున్నారా? బార్షా శర్మా అని తెలుస్తోంది. ఆమె తన డ్యాన్స్ రీల్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పుడు తనను తాను “పుష్ప గర్ల్” గా చెప్పుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు చూసి ఫిదా అయ్యానని తెలిపింది. అంతేకాదు బన్నీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ట్యాగ్ చేస్తూ “అమేజింగ్ క్రేజీ స్టెప్” అని పేర్కొనడంతో బన్నీ అభిమానులు కూడా ఈమెకు ఫ్యాన్స్ అయ్యారు.

గతంలో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప: ది రూల్‌ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకువచ్చేందుకు సిద్దం అవుతుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, జగదీష్‌, ధనుంజయ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper