spot_img
Homeబాలీవుడ్Manoj Bajpayee: వాళ్ల నాన్న ను చనిపొమ్మని చెప్పిన మనోజ్ బాజ్ పాయ్..కారణం ఏంటంటే..?

Manoj Bajpayee: వాళ్ల నాన్న ను చనిపొమ్మని చెప్పిన మనోజ్ బాజ్ పాయ్..కారణం ఏంటంటే..?

Manoj Bajpayee: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్..రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమాతో బాలీవుడ్ లో ఒక్కసారిగా ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మనోజ్ బాజ్ పాయి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు నే సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో ఆయన ప్రేమ కథ, హ్యాపీ, వేదం,
లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవి ఏంటి అంటే వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా వాళ్ళ నాన్నను చనిపోమని చెప్పాడట. ఇక ఈ విషయాన్ని తలుచుకుంటూ ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. అసలు విషయం ఏంటి అంటే తను ఒక రోజు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు వాళ్ల సిస్టర్ ఫోన్ చేసి అన్నయ్య నాన్న ఇక లేనట్టే అని చెప్పిందట.

ఇక దాంతో ఆయన వాళ్ళ నాన్న చనిపోయాడేమో అనుకున్నడట. కానీ వాళ్ళ సిస్టర్ మాత్రం చనిపోలేదు కొన ఊపిరితో ఉన్నాడు నొప్పి భరించలేకపోతున్నాడు అని చెప్పిందట. ఇక దాంతో వెంటనే తను తన క్యారవాన్ లోకి వెళ్లి వాళ్ళ నాన్నతో ఒక పది నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడాడట..అలా మాట్లాడుతూనే “నాన్న అంత సేపు బాధ భరించలేక పోతే చనిపోండి నాన్న” అంటూ తనే స్వయంగా ఆ మాట చెప్పాల్సి వచ్చిందంట.

ఇక దాంతో ఆయనే స్వయంగా వాళ్ల నాన్నని చనిపోమని అన్నానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడట… ఇంత గొప్ప నటుడు అయినప్పటికీ ఆయన జీవితంలో ఇలాంటి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండడం అనేది నిజంగా చాలా బాడ్ న్యూస్ అనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper