Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు లేకుండా కొన్ని సన్నివేశాల్లో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో డూపులను వాడుతూ హీరోలు రిస్క్ స్టంట్స్ చేయకుండా తప్పించుకుంటున్నారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేశారు. దాన్ని సవాలుగా తీసుకున్న మన హీరోలందరు ఇప్పుడు రిస్కీ ఫైట్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ […]

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు లేకుండా కొన్ని సన్నివేశాల్లో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో డూపులను వాడుతూ హీరోలు రిస్క్ స్టంట్స్ చేయకుండా తప్పించుకుంటున్నారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేశారు. దాన్ని సవాలుగా తీసుకున్న మన హీరోలందరు ఇప్పుడు రిస్కీ ఫైట్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఒక్కరొక్కరుగా గాయాల పాలవుతూ ఉండటం చూస్తున్న వాళ్ళ అభిమానులు సైతం రిస్కీ ఫైట్స్ మన స్టార్ హీరోలు చేయాల్సిన పనిలేదు. డూప్ ల తోనే చేయించండి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి హీరోలు భారీ ఫైట్స్ చేయడం వల్ల వాళ్లకి ఏమైనా గాయాలు తగిలితే సినిమా షూటింగ్ కొద్ది రోజులపాటు నిలిపేయాల్సి వస్తుంది.

దానివల్లనే డూప్ లతో ఫైట్స్ సీక్వెన్స్ లను చేయించి హీరోలతో కీలకమైన సన్నివేశాలలో నటింపజేయాలని దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది కొన్ని రోజుల నుంచి హీరోలను ట్రోల్ చేస్తుండడం వల్ల మన హీరోలు సైతం మేము కూడా రిస్కీ షాట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

కానీ దర్శకులు మీరే మమ్మల్ని చేయనివ్వడం లేదు అని చెప్పడంతో వాళ్ల నిర్ణయానికి కట్టుబడినా డైరెక్టర్స్ హీరోల చేతే ఫైట్స్ చేయించారు. దానివల్ల బాలయ్య బాబు మజిల్ ఇంజురీ అయింది. రామ్ చరణ్ మణికట్టు దగ్గర నరానికి ఇబ్బంది కలిగింది. ప్రభాస్ మోకాలుకి ఇంజురీ అవ్వడం మనకు తెలిసిందే. ఇక నిన్న జూనియర్ ఎన్టీఆర్ కి సైతం షోల్డర్ ఇంజురీ అయింది.

ఇవన్నీ చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. హీరోలు వరుసగా ఇలా ఇంజురీ అయితే సినిమాల పరిస్థితి ఏంటి అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు… ఇప్పటికైనా కొన్ని రిస్కీ స్టంట్స్ డూప్ లతో చేయిస్తేనే బెటరని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు… ఇక డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఇంజురీ అవ్వడం వల్ల డ్రాగన్ సినిమా షూటింగ్ 6 వారాల పాటు పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper