Homeఆంధ్రప్రదేశ్‌AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసేందుకు కూడా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలత కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రకమైన బియ్యాన్ని పాఠశాలలు, హాస్టల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్రం లబ్ధిదారులకు అందించేందుకు […]

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసేందుకు కూడా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలత కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రకమైన బియ్యాన్ని పాఠశాలలు, హాస్టల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్రం లబ్ధిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. దీనికి కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలత వ్యక్తం చేసింది.

* తయారీ విధానం ఇలా..
ఈ స్టీమ్డ్ రైస్ తయారీ విధానం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. వరి పొట్టుతో సహా గింజలను ఆవిరితో ఉడికించి.. ఆరబెట్టిన తర్వాత మిల్లింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ధాన్యం పొట్టు, తౌడులో ఉండే పోషకాలు నేరుగా గింజల్లోకి చేరతాయి. దీనివల్ల వినియోగదారులకు పోషకాహారం అందుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ ఈ స్టీమ్ రైస్ అందించేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేసి లోపాలను సవరించుకొని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉంది.

* నాణ్యమైన సరుకులను సైతం..
ఒక్క స్టీమ్ డు రైస్ మాత్రమే కాదు నాణ్యమైన నిత్యవసర సరుకులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సైతం ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఏపీ వ్యాప్తంగా ఉన్న రేషన్ డిపోల ద్వారా సుమారు 1000 కి పైగా మీ మార్ట్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా దాదాపు 70 రకాల నాణ్యమైన వినియోగ వస్తువులను వినియోగదారులకు విక్రయించిన అన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మరోవైపు రేషన్ డీలర్లకు మెరుగైన ఉపాధి దక్కే అవకాశం కూడా ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper