Samsung Galaxy Z Fold 8 : స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శ్యాంసంగ్ మొబైల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు అంటే చాలా మంది లైక్ చేస్తారు. అయితే ఇటీవల దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన ఫోల్డింగ్ ఫోన్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇందులో కొన్ని ఫీచర్లు మిగతా వాటికంటే ప్రత్యేకంగా నిలుస్తున్నాయని అంటున్నారు. అందులో 5 ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ 5 ఫీచర్ల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
శాంసంగ్ తన ప్రీమియం సెగ్మెంట్ లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Fold 8 ను మార్కెట్లోకి జూలై 22న తీసుకువచ్చింది.దీని డిజైన్ చూసి వినియోగదారులు విపరీతమైన లైక్ చేస్తున్నారు. ఇందులో ఉన్న మొదటి డిజైన్.. ఫోన్ మధ్యలో మడత మార్క్ లేకపోవడం. ఈ ఫోన్ లో ‘ఫ్లెక్స్ టైటానియం’ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో ఫోన్ మడత విప్పినప్పుడు స్క్రీన్ క్రీజ్ దాదాపుగా కనిపించకుండా అత్యంత ప్లాట్‌గా, స్మూత్‌గా మారుతుంది. దీనికి తోడు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వెలుతురులో కూడా స్పష్టమైన విజువల్స్ లభిస్తాయి.
ఈ కొత్త ఫోన్ లో Z Fold 8 అనే వేరియంట్ పై కొనియాడుతున్నారు. మొబైల్ మడత విప్పినప్పుడు దీని మందం కేవలం 4.1 ఎంఎం మాత్రమే ఉంటుంది. బరువు కూడా కవేలం 201 గ్రాములు ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. దీంతో ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లానే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఫోన్ పనితీరు విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ , గ్రాఫిక్స్ కోసం ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. అలాగే ఇందులో 16 జీబీవరకు ర్యామ్ , 1 టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కెమెరా విషయానికొస్తే.. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉండనుంది. వీడియో రికార్డింగ్ కోసం 8 కె రిజల్యూషన్ పనిచేస్తుంది. వీటితో పాటు ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్ డిజైన్ తో పాటు బ్యాటరీ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీని ద్వారా 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉండనుంది. దీనికి 45 వాట్ వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను చేయనుంది. అలాగే కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్ దాదాపు 67 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.