Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సక్సెస్ లు లేకపోతే ఎక్కువ రోజులు పాటు గ్యాప్ ని తీసుకుంటారు. కారణం ఏంటి అంటే గత సినిమాలు నిరాశ పరచడం వల్ల ఇప్పుడు చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. కానీ సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన దర్శకులు తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో వాళ్లకు ఉన్న క్రేజ్ ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు సక్సెస్ ట్రాక్ ఎక్కిన కూడా తమ తదుపరి సినిమాల విషయంలో చాలావరకు లేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చందు మొండేటి సైతం కార్తికేయ సినిమా చేసిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని తండేల్ అనే సినిమా చేశాడు. ఇప్పటికి తండేల్ మూవీ రిలీజ్ అయి సంవత్సరం దాటింది. అయిన కూడా ఇప్పటివరకు మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు.
కారణం ఏదైనా కూడా సినిమా సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో వాళ్ళకి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వీలైనంత తొందరగా సినిమాలను స్టార్ట్ చేస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం చెపుతున్నారు.
ఇక ఈ బాటలోనే గత సంవత్సరం ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన సాయి మార్తాండ్ సైతం చేరిపోతాడు. ఇప్పటివరకు ఆయన మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు. అడివి శేషు హీరోగా ఒక సినిమా ఉండబోతుంది అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు అవి కార్యరూపమైతే దాల్చడం లేదు.
ఇక వీళ్లిద్దరితో పాటుగా మరికొంతమంది దర్శకులు సైతం సక్సెస్ వచ్చినా కూడా తదుపరి సినిమాను స్టార్ట్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి స్క్రిప్ట్ రాసుకోవడంలో వాళ్ళు ఆలస్యం చేస్తున్నారా? లేదంటే వాళ్లు అనుకున్న హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదా అనేది పర్ఫెక్ట్ గా తెలియదు కానీ మొత్తానికైతే సినిమా సినిమాకి గ్యాప్ ఇవ్వడం వాళ్ళకున్న మార్కెట్ దెబ్బతినే ప్రమాదమైతే ఉంది…